తారకరత్న మరణం.. నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. ఇన్నిరోజులు కంటికి రెప్పలా చూసుకున్న బాలయ్య అయితే ఎమోషనల్ అయిపోతున్నారు. ఆయన్ని ఆపడం ఎవరి వల్ల కావట్లేదు.
నందమూరి తారకరత్న తుదిశ్వాస విడిచారు. నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా అస్వస్థతకు గురైన ఈయన.. 23 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. హాస్పిటల్ లో తారకరత్నను చేర్చిన తర్వాత స్పందిస్తున్నాడు. త్వరలో కోలుకుంటాడు అని కుటుంబసభ్యులు చెప్పేసరికి.. నందమూరి అభిమానులు తారకరత్న తిరిగొస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడిలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతారని అస్సలు ఊహించలేదు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఫ్యాన్స్ అయితే దీన్ని తట్టుకోలేకపోతున్నారు. తారకరత్న బాబాయ్ బాలకృష్ణ అయితే ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. లోకేష్ పాదయాత్రలో తారకరత్న కుప్పకూలిన దగ్గరనుంచి.. బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి అతడిని తరలించడం, దగ్గరుండి మరీ జాగ్రత్తలు తీసుకున్నది బాలకృష్ణే. తారకరత్న వెన్నంటి ఉండి.. పేరుకే బాబాయ్ అయినప్పటికీ ఓ కన్న తండ్రిలా కేర్ తీసుకున్నారు. ఓవైపు తారకరత్నని బతికించుకోవడానికి డాక్టర్స్ ఎంత చొరవ తీసుకున్నారో.. బాలయ్య అంతకు మించి ఆరాటపడ్డారు. తనకు అయినంతవరకు పూజాలు, హోమాలు చేయించాలని తెలుస్తోంది. అదీగాక తారకరత్న కోసం ఆయన ఎంతలా సాయం చేశారో.. మనం చాలా విజువల్స్ కూడా చూశాం.
అలాంటి బాలయ్య ఇన్నిరోజులు తారకరత్న కోసం చాలా కేర్ తీసుకున్నారు. అలాంటి తన కొడుకు లాంటి తారకరత్న చనిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టి.. అందరినీ కంటతడి పెట్టించారు. ‘ బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా… నందమూరి అభిమానులకు, టీడీపీ కుటుంబ సభ్యులకు తారకరత్న మరణం తీరని లోటు. నటనలోనూ తనకు తాను నిరూపించుకున్నాడు. కఠోరంగా మృత్యువుతో పోరాడుతున్నప్పుడు మృత్యుంజయుడై తిరిగి వస్తాడు అనుకున్న తారకరత్న ఇక కానరాని లోకాలకు వెళ్ళాడు. తారతరత్న ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలి’ అని బాలయ్య రాసుకొచ్చారు. మరి తారకరత్న మృతిపై సంతాపాన్ని కింద కామెంట్స్ తెలిపి అతడి ఆత్మకు శాంతి కలిగేలా చేయండి.