బాలకృష్ణ-ప్రగ్యా జైస్వాల్ అఖండ సినిమాలో జంటగా కలిసి మెప్పించారు. ఇక అఖండ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో మరోసారి ఈ జంట కలిసి నటించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే మరోసారి ఈ జంట కలిసి షూటింగ్ లో పాల్గొన్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ అటు రాజకీయాల్లోనూ.. ఇటు సినిమాల్లోనూ దూసుకెళ్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా సంక్రాంతి కానుకగా బాలయ్య నుంచి వచ్చిన చిత్రం ‘వీర సింహారెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే తాజాగా బాలయ్య కు సంబంధించిన ఓ పెళ్లి ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. పెళ్లి కూతురు ఎవరో కాదండోయ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. అవును అఖండ సినిమా తర్వాత రెండో సారి బాలయ్యతో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే మీరనుకున్ననట్లు ఇది సినిమా షూటింగ్ మాత్రం కాదు.
బాలకృష్ణ-ప్రగ్యా జైస్వాల్ అఖండ సినిమాలో జంటగా కలిసి మెప్పించారు. ఇక అఖండ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో మరోసారి ఈ జంట కలిసి నటించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అదీకాక వీరిద్దరు కలిసి నటిస్తే.. ఆ బొమ్మ బ్లాక్ బస్టర్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అభిమానులను మరోసారి అలరించబోతున్నారు బాలయ్య-ప్రగ్యా. కానీ ఈ సారి వీరు కలిసి కనిపించబోయేది సినిమాలో కాదని తెలుస్తోంది. ఓ యాడ్ షూట్ కు సంబంధించి పెళ్లి పీటలెక్కారు బాలయ్య-ప్రగ్యా జైస్వాల్. పెళ్లి బట్టల్లో నవ్వులు చిందిస్తున్న బాలయ్య ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక పక్కనే ఆకు పచ్చ చీరలో మెరిసిపోతుంది ప్రగ్యా.
ప్రస్తుతం ఈ యాడ్ షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక బాలయ్య ఈ మధ్యే యాడ్స్ చెయ్యడం కూడా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. గతంలో సాయి ప్రియా కన్ స్ట్రక్షన్ గ్రూప్ కోసం బాలయ్య యాడ్ షూట్ లో పాల్గొన్నారు. తాజాగా మరికొన్ని కమర్షియల్ బ్రాండ్స్ కూడా బాలయ్య సంతకం చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే ఈ తాజా యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు బాలకృష్ణ. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ తో పెళ్లి పీటలపై ఉన్న బాలకృష్ణ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.