నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు చెప్పగానే మాస్ సినిమాలే గుర్తొస్తాయి. ఆయా చిత్రాలతో ఆయన చూపించిన ఇంపాక్ట్ అలాంటిది మరి. అందుకు తగ్గట్లే ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా వచ్చారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీ.. ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయింది. ఇందులో బాలయ్య మార్క్ యాక్షన్ సీన్స్,డైలాగ్స్ ఉండేసరికి ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. అయితే రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరిట ఈవెంట్ నిర్వహించగా అందులో బాలయ్య మాటలు తెలుగునాట ఓ వివాదానికి కారణమయ్యాయి. ప్రస్తుతం అంతటా కూడా అదే చర్చ నడుస్తోంది.
ఇక విషయానికొస్తే.. బాలయ్య ఎక్కడైనా స్పీచ్ లో మాట్లాడారంటే అప్పటికప్పుడు అనిపించిన విషయాల్ని మాట్లాడేస్తూ ఉంటారు. తన సినిమాల విషయం చెబుతూనే, తన తండ్రి ఎన్టీఆర్ గురించి కూడా ప్రతిసారి ప్రస్తావిస్తుంటారు. తాజాగా జరిగిన ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ పార్టీలో పెద్ద ఎన్టీఆర్ వరకు చెప్పి వదిలేసుంటే పెద్దగా సమస్య ఉండేది కాదు. కానీ ‘అక్కినేని తొక్కినేని’ అని అనడం పెద్ద వివాదం అయి కూర్చుంది. దీనికి కౌంటర్ గా అన్నట్లు హీరోలు నాగచైతన్య, అఖిల్.. ట్వీట్స్ పెట్టడం ఈ చర్చని ఇంకాస్త పెంచినట్లయింది. అయితే బాలయ్య ఈ వ్యాఖ్యల్ని కావాలని అనలేదు. అలా మాట్లాడుకునేవాళ్లం అని చెబుతూ ఆ కామెంట్స్ చేశారు తప్పించే ఆయన ఉద్దేశం వేరు.
సినిమాలతోపాటు పలు షోల షూటింగ్స్.. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంటాయి. ప్రస్తుతం బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో కూడా అక్కడే జరుగుతోంది. ఇక తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యల వల్ల ఆయన్ని.. స్టూడియోలోకి రాకుండా నిషేధించారనే వార్త వినిపిస్తోంది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది. మేం(సుమన్ టీవీ).. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్లతో మాట్లాడగా.. ఈ పుకార్లని వాళ్లు పూర్తిగా కొట్టిపారేశారు. దీంతో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వదంతులు.. కేవలం వదంతులే అని క్లారిటీ వచ్చేసింది. మరి బాలయ్య వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ చెప్పండి.