ఎక్కడచూసినా ‘అవతార్ 2’ మేనియా నడుస్తోంది. టాక్ ఏంటనేది పక్కనబెడితే.. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్లలోనే ఎక్స్ పీరియెన్స్ చేయాలని ఫిక్సవుతున్నారు. ఇందులో సైలెంట్ గా థియేటర్లకు వెళ్లి సినిమా చూసేస్తున్నారు. అందులో భాగంగానే కలెక్షన్స్ కూడా వేలకోట్లు వసూలు క్రాస్ అవుతున్నాయి. బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన తాజా వసూళ్లు.. సినీ ప్రేక్షకుల మతిపోగుడుతున్నాయి. ఎంత వసూలు చేసిందనేది ఓసారి చూసేద్దాం.
ఇక విషయానికొస్తే.. 2009లో ‘అవతార్’ రిలీజైనప్పుడు సంచలనం సృష్టించింది. టాలీవుడ్ లో అప్పుడప్పుడే సినిమాలు రూ.100 కోట్ల మార్క్ క్రాస్ చేస్తున్నాయి. అదే టైంలో ఈ హాలీవుడ్ మూవీ మాత్రం.. లాంగ్ రన్ లో రూ.113 కోట్ల మేర కలెక్ట్ చేసింది. ఎంతోమంది వన్ ఆఫ్ ది ఫేవరెట్ సినిమాగా మారింది. దీంతో సీక్వెల్ కోసం తెగ ఎదురుచూశారు. ఇక రెండో పార్ట్ కోసం ఏకంగా 13 ఏళ్లు వర్క్ చేసిన డైరెక్టర్ జేమ్స్ కామెరూన్, ‘అవతార్ 2’ కోసం 250 మిలియన్ డాలర్స్ పైనే పెట్టాడు. అంటే భారత కరెన్సీలో రూ.3 వేల కోట్ల రూపాయలు. ఈ మార్క్ ని ఎప్పుడో క్రాస్ చేసిందీ చిత్రం.
ఇక డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. మొత్తంగా ఐదు రోజుల్లో ఈ సినిమా 497.1 మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించింది. అంటే మన కరెన్సీలో రూ.4110.25 కోట్లు. విజువల్ వండర్ గా తీసిన ఈ చిత్రానికి మన దేశంలో తొలి రోజు రూ.41 కోట్లు, రెండో రోజు రూ.45 కోట్లు, మూడో రోజు రూ.43.30 కోట్లు, నాలుగో రోజు రూ.14 కోట్లు, ఐదో రోజు రూ.15 కోట్లు వచ్చాయి. ఇలా 5 రోజుల్లో మొత్తంగా రూ.161.30 కోట్ల నెట్ షేర్ సాధించింది. గ్రాస్ తీసుకుంటే రూ.202 కోట్ల మార్క్ క్రాస్ అయినట్లు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో కలిపి రూ.47 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేం లేవు కాబట్టి.. ‘అవతార్ 2’ కలెక్షన్స్ ఇంకా పెరిగే ఛాన్సుంది. లాంగ్ రన్ లో రూ.15 -20 వేల కోట్ల కలెక్షన్స్ రావొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ‘అవతార్ 2’ వసూళ్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.