టాలీవుడ్ లో అల్లు అర్జున్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తన పేరు మీద ఒక పెద్ద మల్టీప్లెక్స్ నిర్మించే పనిలో భాగస్వామిగా నిలిచాడు అల్లు అర్జున్.
స్టార్ హీరోలు సినిమాలతో పాటుగా బిజినెస్ మీద కూడా ఓ కన్నేస్తారు. ఒక పక్క సినిమాలు చేస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా బిజినెస్ మీద దృష్టి పెడతారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు హోటళ్లు, స్టూడియోలు, సినిమా హాళ్ల ద్వారా సొంతంగా బిజినెస్ నడుపుతూ.. వారి సంపాదనను పెంచుకుంటున్నారు. అయితే ఈ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ విషయంలో మరింత దూకుడు చూపిస్తున్నాడు. అంతే కాదు ఇదివరకు ఏ హీరోకి దక్కని ఒక అరుదైన గౌరవం అల్లుఅర్జున్ కి దక్కనుందని సమాచారం.
టాలీవుడ్ లో అల్లు అర్జున్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పుష్ప సినిమా ఈ ఐకాన్ స్టార్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఏ విషయంలో తగ్గేలా లేను అన్నట్లు గా ముందుకు సాగుతున్నాడు. ఇటు సినిమాలు అటు బిజినెస్ ఇలా ఎం చేసినా పట్టుకుందల్లా బంగారంలా మారిపోతుంది. ఇక ప్రస్తుతం తన పేరు మీద ఒక పెద్ద మల్టీప్లెక్స్ నిర్మించే పనిలో భాగస్వామిగా నిలిచాడు అల్లు అర్జున్. వివరాల్లోకెళ్తే.. ఆసియన్ సంస్థల అధినేత సునీల్ నారంగ్ గతంలో మహేష్ బాబు భాగస్వామ్యంతో “AMB” అనే మల్టీప్లెక్స్ నిర్మించారు. ఈ మల్టీప్లెక్స్ హైద్రాబాద్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచింది.
అయితే ఇప్పడు అదే సంస్థ అల్లు అర్జున్ తో కలిసి హైద్రాబాద్ అమీర్ పేట్ లో సత్యం థియేటర్ ని తీసుకొని AAA నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. AAA అనగా ఆసియన్ అల్లు అర్జున్. దీనికి సంబంధించి పని దాదాపు పూర్తయింది. మరో మూడు లేదా నాలుగు నెలల్లో ఏఏఏ ని ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ థియేటర్ కి చాలా ప్రత్యేకతలు ఉండేలా చూసుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ వర్చువల్ ఇమేజే ని ఏర్పాటు చేయనుండడం విశేషం. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోకి కూడా ఇలా థియేటర్ లో వర్చువల్ ఇమేజ్ లేదు. ఒకవేళ ఇదే గనుక జరిగితే ఈ ఘనత సాధించిన తొలి హీరోగా అల్లు అర్జున్ నిలవనున్నాడు. దీని ముందు నించొని ఎవరు ఎలా చేస్తే అలా రియాక్ట్ అవుతుందని సమాచారం.
#news ఆసియన్ అల్లు అర్జున్ థియేటర్ లో భారీ ఖర్చుతో వర్చ్యువల్ అల్లు అర్జున్ బొమ్మ ఏర్పాటుకు సన్నాహాలు. థియేటర్ లో కొన్ని వందల ఎల్ ఇ డి లు…భారీ టీవీ స్క్రీన్ పై సినిమా…ఎఎ లాంజ్..ఇంకా..ఇంకా..
…@alluarjun @AsianSuniel— devipriya (@sairaaj44) March 7, 2023