అషూరెడ్డి.. ఒక టిక్‌టాకర్‌గా కెరీర్‌ని ప్రారంభించి ఆ తర్వాత యాంకర్‌గా, రెండుసార్లు బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా మారింది. ఇప్పుడు ఒక చిన్నసైజ్ సెలబ్రిటీ అయిపోయింది. యాంకరింగ్‌కి కాస్త గ్యాప్ ఇచ్చిన అషూరెడ్డి కవర్ సాంగ్స్ కూడా చేసింది. అంతేకాకుండా హీరోయిన్‌గా కూడా ప్రేక్షకులను అలరించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా అషూ.. తన లైఫ్‌లో జరిగే ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. రామ్ గోపాల్ వర్మని చేసిన ఇంటర్వ్యూ తర్వాత అషూరెడ్డికి బోల్డ్ బ్యూటీ అని పేరు వచ్చింది. ఆమె లోపల ఏమనుకుంటే అదే విషయాన్ని ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే చెప్పేస్తుంది. ఇలా అంటే ఎవరు ఏమనుకుంటారో? అనే బిడియంలాంటివి ఏమీ అషూ పెట్టుకోదు.
ఆమె బోల్డ్ గా మాట్లాడటమే కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్ కూడా కొన్నిసార్లు బోల్డ్ గా పోస్ట్ చేస్తుంటుంది. అయితే వాటిని చాలా మంది ట్రోల్ కూడా చేస్తుంటారు. సాధారణంగా అషూరెడ్డి అలాంటి వాటిని పట్టించుకోదు. కానీ, ఈ మధ్యకాలంలో ట్రోల్స్ చేసేవారికి, కామెంట్స్ పెట్టేవారికి అషూరెడ్డి స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇస్తోంది. తాజాగా అషూరెడ్డి పెట్టిన ఇమేజెస్ కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడమే కాకుండా.. ట్రోలింగ్‌కి కూడా గురవుతున్నాయి. అలాంటి వారికి అషూ తాజాగా ఓ రీల్ రూపంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దేశముదురు సినిమాలో రమాప్రభ చెప్పిన కామాతురాణం డైలాగ్‌ని రీల్ చేసి తన ఖాతాలో పోస్ట్ చేసింది.
కామా తురాణం, నభయం, నలజ్జ.. కామంతో కళ్లు మూసుకుపోయిన వెధవకి సిగ్గు, లజ్జ, భయం, భక్తి ఏమీ ఉండవు అని చెప్పుకొచ్చింది. డైలాగ్ దేశముదురు సినిమాలోది అయినప్పటికీ ఉద్దేశం మాత్రం అషూరెడ్డిదే అర్థమైపోయింది. అంతేకాకుండా ఆ రీల్‌కి క్యాప్షన్ కూడా జత చేసింది. నా ప్రొఫైల్ లో కామెంట్ చేసే కొందరికి దీనిని అంకితం చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ రీల్‌కి కూడా నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. కొందరైతే ముందు నీకు అవన్నీ ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు అయితే మాకు అవన్నీ లేవు.. మేము ఎప్పుడో వదిలేశాం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది ఈ వీడియోలో కూడా ఆమె డ్రెస్సింగ్ గురించే కామెంట్ చేస్తున్నారు.