టిక్ టాక్ తో చాలా మంది కామన్ పీపుల్ సెలబ్రెటీలు అయిపోయారు. కానీ.., దీని కన్నా ముందు డబ్ స్మాష్ అనే మరో యాప్ ఉండేది. ఆ యాప్ ద్వారా ఫేమస్ అయిన బ్యూటీ అషూ రెడ్డి. డబ్ స్మాష్ లో ఈమె జూనియర్ సమంతాగా గుర్తింపు దక్కించుకుంది. ఆ తరువాత ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ క్రేజ్ కారణంగానే అషూ రెడ్డి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నా.., ఆటతో మాత్రం మెప్పించలేకపోయింది. ఇక బిగ్ బాస్ నుండి బయటకి వచ్చాక కూడా అషూ రెడ్డి కెరీర్ పెద్దగా స్పీడ్ అందుకుంది లేదు. ఏదో ఒక టెలివిజన్ షోలో గెస్ట్ గా మెరవడం తప్పించి..,అషూ తనకంటూ ఒక షోని సెట్ చేసుకోలేకపోయింది. సీరియల్స్, సినిమాల్లోనూ ఈమెకి ఆఫర్స్ లేవు. ఇక తాజాగా అషూ రెడ్డి చేసిన ఓ పనికి ఆమె పై వాళ్ళ అమ్మ సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మధ్య కాలంలో ఇంట్లో వారితో ఫ్రాంక్ చేయడం.., ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం నయా ట్రెండ్ గా మారింది. అషూ రెడ్డి కూడా ఇప్పుడు ఇలాంటి ప్రయత్నమే చేసింది. అషూ రెడ్డి తన తల్లికి ఓ హ్యాండ్ బ్యాగ్ ని చూపిస్తూ.. దీన్ని లక్షన్నర పెట్టి కొన్నానని చెప్పింది. అది అంత ఖరీదు చేస్తుందా? అని ఆశ్చర్యపోయిన ఆమె నిజం చెప్పు అంటూ కూతురిని ఒకటికి రెండుసార్లు అడిగింది. దీనికి అషూ నిజమేనని సమాధానం చెప్పడంతో ఆమె తల్లి ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయింది. హ్యాండ్ బ్యాగ్‌ను విసిరికొట్టి, ఇప్పటికే ఎన్నో ఉండగా.. మళ్లీ ఇదెందుకు అంటూ కోప్పడింది. కానీ ఆమె కోపాన్ని ఏమాత్రం పట్టించుకోని అషూ పడీపడీ నవ్వింది. కొంతసేపు తన తల్లిని ఆట పట్టించిన తరువాత.., బ్యాగ్ తనకి బహుమతిగా వచ్చిందంటూ అసలు విషయం చెప్పుకొచ్చింది అషూ. ప్రస్తుతం ఈ ఫ్రాంక్ వీడియో నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.