Tamil Rockerz: ఆన్లైన్లో సినిమాలు చూసేవారికి, డౌన్‌లౌడ్ చేసేవారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘తమిళ్‌రాకర్స్’. పైరసీ సినిమాల అడ్డా అయిన ‘తమిళ్ రాకర్స్’ కారణంగా ఎంతో మంది సినీ నిర్మాతల జీవితాలు నాశనం అయ్యాయి. మరెంతో మంది నిర్మాతలు కంటి మీద కునుకు లేకుండా అల్లాడిపోతున్నారు. దాదాపు పదేళ్లకు పైగా సినిమాలను పైరసీ చేస్తూ.. ఆన్లైన్లో వాటిని ఫ్రీగా అందిస్తున్న తమిళ్‌రాకర్స్.. దేశ వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. గతంలో టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలకు ముందే హెచ్డీ క్వాలిటీతో ‘తమిళ్ రాకర్స్’లో దర్శనమిచ్చింది.
దీంతో అభిమానులతో పాటు దర్శక నిర్మాతలు షాక్‌కు గురయ్యారు. పవన్ సినిమానే కాదు అన్ని భాషల్లోని సినిమాలను ఈ ‘తమిళ్ రాకర్స్’ పైరసీ చేశారు. పైరసీతో సినీ ఇండస్ట్రీకి పిచ్చెక్కిస్తున్న తమిళ్ రాకర్స్‌పై తాజాగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఆ వెబ్ సిరీస్ పేరు ‘తమిళ్ రాకర్స్’.. ప్రముఖ తమిళ దర్శకుడు ‘అరి వలగన్’ ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇందులో అరుణ్ విజయ్ హీరోగా నటించారు. ‘తమిళ్ రాకర్స్’ ఎవరు? వాళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారు? అన్న విషయాలే ప్రధాన అంశాలుగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.
ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. 2.19 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఇందులో ‘అత్తారింటికి దారేది’ సినిమా ప్రస్తావన కూడా వచ్చింది. ఇక, ‘అత్తారింటికి దారేది’ పైరసీ వెనుక ఎవరున్నారు? హెచ్డీ క్వాలిటీ ప్రింట్ తమిళ్ రాకర్స్‌కు ఎలా అందిందన్న విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్‌లో ఆగస్టు 19నుంచి అందుబాటులో ఉండనుంది. మరి, తమిళ్ రాకర్స్ ట్రైలర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Jr NTR: భార్యకి ఖరీదైన ఫామ్ హౌస్ ని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్