‘ది లెజెండ్’ ఈ సినిమా పేరు పాన్ ఇండియా లెవల్లో మారు మ్రోగుతోంది. అయితే కలెక్షన్ విషయంలో కాదులెండి. ఈ సినిమా అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచి హీరో వయసు, లుక్స్, ఆయన డాన్స్, డైలాగులు, పోస్టర్ ఇలా ఒకటేమిటి.. ప్రతి అంశం మీద ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. హీరో అవ్వడానికి వయసుతో సంబంధం లేదంటూ చెబుతూ అరుళ్ శరవణన్ 52 ఏళ్ల వయసులో హీరోగా డెబ్యూ అయ్యారు.
వందల కోట్లు సంపాందించే వ్యాపారవేత్త తన సొంత ప్రొడక్షన్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడిన విషయం తెలిసిందే. కానీ, బడ్జెట్ రూ.80 కోట్లు పోయినా అరుళ్ శరవణన్ కి మాత్రం ఎలాంటి నష్టం లేదు పైగా లాభమే అని చెబుతున్నారు. పాన్ ఇండియా లెవల్లో తన బ్రాండ్ పబ్లిసిటీకి ఈ సినిమా బాగా ఉపయోగపడిందంటున్నారు.
అయితే ప్రస్తుతం ది లెజెండ్ సినిమాకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. సినిమాలో ఒక మంచి ఎమోషన్ సీన్ ఉంటుంది. శరవణన్ భార్య తులసి చనిపోయినట్లు విలన్స్ క్రియేట్ చేస్తారు. అది నిజమని నమ్మ హీరో భార్య పోయిందని బాధపడుతూ ఉంటాడు. కానీ, థియేటర్లో మాత్రం ఫ్యాన్స్ అంతా అందుకు భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. అంతా కేకలు వేస్తూ.. పగలబడి నవ్వుతూ కనిపించారు. సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. ఈ వైరల్ వీడియోపై మీ ఆభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) July 30, 2022