‘ది లెజెండ్’ ఈ సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో బాగా వైరల్ అవుతున్న పేరు. హీరో గురించి కానివ్వండి, బడ్జెట్, ట్రోల్స్ కావచ్చు, కలెక్షన్స్ కావచ్చు, అసలు ఆయన హీరో అవ్వాలనుకోవడంపై కావచ్చు.. పాయింట్ ఏదైనా చర్చ అయితే జరుగుతూనే ఉంది. ది లెంజెండ్ శరవణ స్టోర్స్ అధినేత అరుళ్ శరవణన్ నటించి, నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అందరి నోటా నానుతున్న విషయం మాత్రం ఒప్పుకోవాల్సిందే. సినిమా పరంగా బిలో యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా.. పబ్లిసిటీ మాత్రం ఓ రేంజ్ లో జరుగుతోంది. ఈ సినిమా తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ.4.35 కోట్లు కలెక్ట్ చేసిందని చెబుతున్నారు. ఇప్పుడు ఇదే సినిమాకి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వైరల్ కావడమే కాదు.. ఇండియన్ సినిమాలోని హీరోయిన్స్ అందరూ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. Thank you Sid https://t.co/iee5AaS1yt — URVASHI RAUTELA (@UrvashiRautela) July 29, 2022 విషయం ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన ఊర్వశీ రౌతేలా రెమ్యూనరేషన్ విషయం ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో నటించేందుకు ఊర్వశీ రౌతేలాకు లెజెండ్ శరవణన్ అక్షరాలా రూ.20 కోట్లు రెమ్యూనరేషన్ గా ఇచ్చారని చెబుతున్నారు. సినిమాలో నటించడంతో పాటు మూవీ ప్రమోషన్స్ కు కలిపి ఆ మెత్తం చెల్లించారంటున్నారు. My sweetheart Urvashi Rautela is with her hottest and sexiest look at the promotion of #thelegendmovie.. Love you so very much my sweetheart Urvashi Rautela.. @UrvashiRautela pic.twitter.com/8jlJqjWfCW — urvashi__dailydose (@urvashidailydo1) July 25, 2022 ఇప్పుడు ఒక సినిమాకి రూ.20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుని ఊర్వశీ రౌతేలా దీపికా పడుకొణే, అలియా భట్, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్ల సరసన చేరిందంటున్నారు. అంతేకాకుండా ఓ స్టార్ హీరో రేంజ్ రెమ్యూనరేషన్ ఇది అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరైతే అరుళ్ శరవణన్ రేంజ్ అంటే ఆ మాత్రం ఉంటుందిలే అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఊర్వశీ రౌతేలా రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #UrvashiRautela has been Paid 20 Cr Remuneration to act in #TheLegend Movie This is The highest Remuneration Paid To An Indian Heroine Till Now pic.twitter.com/em2xwkZZ3E — NewsQube (@TheNewsQube) July 29, 2022 ఇదీ చదవండి: “ది లెజండ్ శరవణన్” పిచ్చోడు ఏమీ కాదు! పోయింది 80 కోట్లు! లాభం వందల కోట్లు! ఇదీ చదవండి: ఎవరీ లెజెండ్ శరవణన్? వేల కోట్లకి వారసుడు! బాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్!