Archana: టాలీవుడ్ లో పదేళ్ల క్రితం నటిగా ఓ వెలుగువెలిగి.. పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరమైన తెలుగు హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటివారిలో ఒకరు అర్చన శాస్త్రి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ.. నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రీరామదాసు, పాండురంగడు లాంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు దగ్గరైన అర్చన.. హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది.
తాజాగా పాపులర్ బుల్లితెర ప్రోగ్రాం ‘ఆలీతో సరదాగా’ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చి తన కెరీర్, లైఫ్ కి సంబంధించిన విశేషాలు షేర్ చేసుకుంది. కానీ.. ఈసారి తన భర్త జగదీశ్ తో షోలో హాజరైంది అర్చన. ఈ క్రమంలో తన కెరీర్ కి సంబంధించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్న అర్చన.. జగదీశ్ తో పరిచయం, పెళ్లి విషయాలను చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో హోస్ట్ ఆలీ కెరీర్ లో మిస్ చేసుకున్న సినిమాలలో మగధీర ఉందట కదా అని అడిగారు.
రాజమౌళి దర్శకత్వంలో యమదొంగలో సాంగ్ చేసారు. ఆ తర్వాత మగధీరలో ఓ క్యారెక్టర్ కోసం అడిగితే నో చెప్పారట నిజమేనా? అని అడిగారు ఆలీ. దీనిపై స్పందించిన అర్చన.. “అవును. ఆ టైములో నాకు అవగాహన లేకుండా సలోని క్యారెక్టర్ మిస్ చేసుకున్నా. లేదంటే.. తర్వాత మర్యాద రామన్నలో హీరోయిన్ అయ్యుండేదాన్ని కావచ్చు” అని చెప్పుకొచ్చింది అర్చన. ప్రస్తుతం అర్చన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి అర్చన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.