తన అందం, అభినయం, నటనతో ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్న ప్రముఖ నటి అన్వేషి జైన్. సోషల్ మీడియాలో ఈ అమ్మడి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్వేషి జైన్ మొదట్లో మోడలింగ్ రంగం నుంచి మెల్ల మెల్లగా యాంకరింగ్ వైపు వెళ్లింది. ఈ రంగంలో అడుగు పెట్టిన ఈ బ్యూటీకి మొదట్లోనే ఎన్నో అవకాశాలు వచ్చి చేరాయి. వెయ్యికిపైగా టీవీ షోల్లో యాంకరింగ్ చేసిన అన్వేషి తన మార్క్ ను చెక్కుచెదరకుండా నిలుపుకుంది. ఇక ఆ తర్వాత అనేక వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటిస్తూ కుర్రాళ్ల మనసును దోచుకుంది.
దీంతో అప్పటి నుంచి తన సోగసులతో సోషల్ మీడియా షేక్ అయ్యే విధంగా బోల్డ్ ఫోటోస్ పెడుతూ సంచలనం సృష్టించింది. దీంతో ఎంతో ఫేమస్ అయిన అన్వేషి బాలీవుడ్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొని తన ఆట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇంతటి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది.
ఇది కూడా చదవండి: Tamannaah: ప్రపంచంలోనే అత్యంత విలువైన ‘డైమండ్ రింగ్’ సొంతం చేసుకున్న తమన్నా!
ఇందులో ఓ వచ్చే స్పెషల్ సాంగ్ కోసం అన్వేషి జైన్ ఎంపిక చేసుకున్నారట చిత్ర యూనిట్. అయితే మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో హీరో వేణు తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో విడులకు సిద్దంగా ఉంది. ఈ వార్తపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.