Tamannaah: దక్షిణాది మిల్కీబ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దాదాపు 15 ఏళ్లుగా తమన్నా.. తన అందచందాలతో సినీ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. అయితే.. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలా ఉండేదో.. ఇప్పటికీ తన గ్లామర్, ఫిజిక్ లను అలాగే మెయింటైన్ చేస్తుండటం విశేషం. ఇన్నేళ్ల కెరీర్లో తమన్నా హీరోయిన్ గా దాదాపు 50 సినిమాలు పూర్తి చేసుకుంది. ఇక తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో బిజీ అయినటువంటి తమన్నా.. చివరిగా ఎఫ్ 3 సినిమాలో కనిపించింది. అయితే.. తమన్నా తన అందంతో పాటు ఫిట్నెస్ కి కూడా అంతే ప్రాధాన్యతనిస్తుంది. ఎప్పటికప్పుడు వర్కౌట్స్ చేస్తూ సినిమాలకు కావాల్సిన గ్లామర్ ని తెరపై కనబరుస్తోంది. ప్రస్తుతం తమన్నా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది తమన్నా. ఈ క్రమంలో తమన్నా ఆస్తులు ఇవేనంటూ తాజాగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ భామ ఆస్తి మొత్తం రూ.150కోట్లకు పైనే ఉంటుందట. ముంబైలోని జుహూలో రూ.16.60 కోట్ల ఖరీదైన అపార్ట్మెంట్ ఉందని తెలుస్తుంది. ఇక తమన్నా వాడే కార్స్ విషయానికి వస్తే.. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ (రూ.75.59 లక్షలు), బీఎండబ్ల్యూ 320 ఐ (రూ.43.50 లక్షలు). మెర్సిడేస్ బెంజ్ జిఎల్ ఈ (రూ.1.02 కోట్లు).. మిత్సు బిషి పేజర్ స్పోర్ట్స్ కార్ (రూ.29.96 లక్షలు) ఉన్నట్లు సమాచారం. ఇవేగాక తమన్నా దగ్గర ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద వజ్రం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి. అదీగాక ఆ వజ్రం విలువ సుమారు రూ. 2 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు. అయితే.. తమన్నా దగ్గర ఇంత ఖరీదైన వజ్రం ఎక్కడిదని నెటిజన్స్ ఆరా తీయగా.. తమన్నాకు బహుమతిగా ఇచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. దీనిలో నిజమెంతో తెలియాలంటే తమన్నా స్పందించేవరకు వెయిట్ చేయాల్సిందే. మరి తమన్నా చేతి ఉంగరంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.