ఈ మధ్యకాలంలో యంగ్ హీరోయిన్స్ అంతా గ్లామర్ షోలో ఏమాత్రం వెనకాడటం లేదు. ఇదివరకు గ్లామర్ షోకు దూరంగా ఉన్న హీరోయిన్స్ కూడా ఇప్పుడు అన్నింటికి సిద్ధమే అంటున్నారు. ఇటీవలే రౌడీ బాయ్స్ సినిమాతో గ్లామర్ హీరోయిన్స్ లిస్టులో చేరింది కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ ని కలవరపెడుతూ ఉంటోంది. తాజాగా అనుపమ చీరకట్టులో చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్ అవుతోంది. గోల్డ్ కలర్ చీరలో అనుపమ.. రెట్టింపు అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అలాగే ‘చీర కట్టుకోవడం.. ఆ కట్టుకునే క్రమంలో దాన్ని ఆనందించడం ఓ కళ’ అంటూ క్యాప్షన్ జోడించింది.
ప్రస్తుతం అనుపమ ఫొటోస్ కుర్రకారును విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కెరీర్ పరంగా ఇటీవల రౌడీ బాయ్స్ సినిమా చేసిన అనుపమ.. ఆ సినిమాతో గ్లామర్ గేట్లకు స్వాగతం పలికింది. ఇక చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ.. ఇప్పుడు తెలుగులో 18 పేజెస్, కార్తికేయ-2 సినిమాలు చేస్తోంది. మరి అనుపమ లేటెస్ట్ చీరకట్టు ఫోటోషూట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.