భారతీయ సినీ పరిశ్రమలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు. అమీర్ ఖాన్ నటించిన ఎన్నో చిత్రాలు జాతీయ అవార్డులు గెల్చుకున్నాయి. అమీర్ ఖాన్ నటించిన నటించిన దంగల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ చిత్రాల్లో టాప్ ప్లేస్లో ఉంది. అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా మూవీతో థియేటర్లలో అడుగుపెట్టబోతున్నాడు. అలాంటి హీరోని ఓ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అంటే ఎవరో తెలియదని అనడం ఇప్పుడు బీ టౌన్ లో చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ సింగర్, నటుడు అన్నూ కపూర్ అందరికీ సుపరిచితమే.. ఆయన నటించిన ‘క్రాష్ కోర్స్’ అమెజాన్ ప్రైమ్ వీడియో షో లో శుక్రవారం విడుదలైంది. ‘క్రాష్ కోర్స్’ సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో అన్నూ కపూర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఒక విలేకరి అమీర్ ఖాన్ రాబోయే చిత్రం లాల్ సింగ్ చద్దా గురించి అడిగాడు. దీనికి ఆయన వెరైటీగా సమాధానం ఇచ్చాడు.. అసలు అమిర్ ఖాన్ ఎవరని తిరిగి ప్రశ్నించాడు. అతడెవరో తెలియనప్పుడు, అతడి సినిమాలు తనకెలా తెలుస్తాయన్నాడు.
సాధారణంగా తన సినిమాలే తాను చూడనని.. అంతేకాదు వేరే నటుట సినిమాలు కూడా చూడనని తెలిపాడు. ఆ మాటలతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బీటౌన్లో వైరల్గా మారాయి. ఇక టాలీవుడ్ హీరో నాగ చైతన్య తొలిసారిగా అమీర్ ఖాన్ నటించిన లాల్ చంద్ చద్దా మూవీలో నటిస్తున్నాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.