యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన విష్ణుప్రియ.. ఆ తర్వాత యాంకర్ గా మారింది. పలు పాపులర్ షోలకు, స్పెషల్ ఈవెంట్స్ కు యాంకర్ గా వ్యవహరించిన విష్ణుప్రియ ఆ తర్వాత నటన వైపు అడుగులు వేసింది. సంతోష్ శోభన్ తో బేకర్స్ అండ్ బ్యూటీ అనే వెబ్ సిరీస్ లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ నటిస్తున్న వాంటెడ్ పండుగాడు సినిమాలో ఒక హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
విష్ణుప్రియ ఇన్నాళ్లు బుల్లితెరకు దూరంగా ఉన్నా కూడా ఆమె ఫాలోవర్స్ పెరిగారే తప్ప తగ్గలేదు. ఎందుకంటే విష్ణుప్రియ తరచూ సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉంటూ ఉంటుంది. తన డైలీ యాక్టివిటీస్ మొత్తం ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటుంది. అంతేకాకుండా జిమ్ వీడియోలు, డాన్సింగ్ వీడియోలు పెడుతూ అలరిస్తుంటుంది.
కొన్నిసార్లు కొన్ని బోల్డ్ ఫొటో షూట్లు కూడా చేస్తుంటుంది. తాజాగా విష్ణుప్రియ పోస్ట్ చేసిన ఓ బోల్డ్ ఫొటోషూట్ వీడియో, ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతున్నాయి. నైట్ గౌన్ వేసుకుని విష్ణుప్రియ ఇచ్చిన ఫోజులు కుర్రకారును తెగ ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఈ బోల్డ్ ఫొటో షూట్ లు నటనలో బోల్డ్ పాత్రలు వచ్చినా తాను చేయగలనని చెప్పకనే చెప్పేందుకు ఇలా చేస్తుంటుంది అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. విష్ణు ప్రియ ఫొటో షూట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.