కిరాక్ ఆర్పీ.. ఒక కమెడియన్ గా జబర్దస్త్ షోతో కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత సినిమాల్లోనూ ప్రేక్షకులను అలరించాడు. కొన్నాళ్ల తర్వాత జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన కిరాక్ ఆర్పీ కెరీర్లో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం కామెడీ స్టార్స్ తో నవ్వులు పూయిస్తున్నాడు. అంతేకాకుండా ఆర్పీ పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అందరికీ ఆర్పీ ఒక కమెడియన్ గా మాత్రమే తెలుసు. కానీ, ఇటీవలే అతనిలో ఒక మంచి ప్రేమికుడు ఉన్నాడని తెలిసింది. ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు అని అందరికీ తెలిసినా.. ఆర్పీ- లక్ష్మీ ప్రసన్నల ప్రేమ ఎక్కడ? ఎప్పుడు? ఎలా మొదలైందనేది తెలియదు. తాజాగా ‘పార్టీ చేద్దాం పుష్ప’ అనే కార్యక్రమంలో కిరాక్ ఆర్పీ ప్రేమ కథ మొత్తాన్ని ఒక పాట రూపంలో చూపించారు. ఆ పాటలో ఆర్పీ- లక్ష్మీ ప్రసన్న డాన్స్ చేయడం విశేషం. అయితే ఆ పాటకు వాళ్లిద్దరూ ప్రాక్టిస్ చేసిన వీడియో కిరాక్ ఆర్పీ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. మరి.. కిరాక్ ఆర్పీ- లక్ష్మీ డాన్సింగ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.