యాంకర్ శ్రీముఖి.. పరిచయం అక్కర్లేని పేరు. షో ఏదైనా తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ బుల్లితెర యాంకర్. తనదైన పంచులతో కామెడీతో షోలను రక్తికట్టిస్తుంది. తన స్టైల్ తో బుల్లితెర “రాములమ్మ”గా పేరు సంపాందించింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో శ్రీముఖి చాలా యాక్టీవ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా తనకు సంబంధించిన ఓ పిక్ ను షేర్ చేసింది. ఈ పిక్ ఇప్పుడు అందరిలో ఆసక్తిరేపింది.
శ్రీముఖి విషయానికి వస్తే.. యాంకర్ అవడానికి ముందే కొన్ని సినిమాల్లో నటించింది. అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’తో నటిగా కెరీర్ ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి అలరించింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ప్రత్యేకమైన పేరును తెచ్చుకుంది. ఇలా కుర్రకారులో తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా శ్రీముఖి ఓ ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. అది ఏమిటంటే.. “ఫిబ్రవరి 14 2022 ఈ రోజు.. ఈ రోజు గుర్తు పెట్టుకోండి మళ్లీ మాట్లాడుకుందాం. బెస్ట్ వాలెంటైన్స్ ఎవర్” అంటూ లవ్ ఎమోజీలతో ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన ఆ ఫోటోలో ఓ ఫ్లవర్ బొకే పట్టుకొని ఉంది. అయితే మొత్తానికి శ్రీముఖి కూడా ప్రేమలో పడిపోయిందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. బాయ్ ఫ్రెండ్ ని కూడా రివీల్ చెయ్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి పెట్టిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.