తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్స్ తమ టాలెంట్ చూపించినా.. కొద్దిమంది మాత్రమే పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో యాంకర్ శ్రీముఖి ఒకరు. పటాస్ షో తో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ షోలో శ్రీముఖిని రాములమ్మగా పిలిచేవారు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 లో చివరి వరకు గట్టి పోటీ ఇచ్చి రన్నరప్ గా నిలిచింది. ఓ వైపు బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే పలు చిత్రాల్లో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
ఎవరికైనా సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని ఉంటుంది. అందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. యాంకర్ శ్రీముఖి కి ఓ అందమైన ఇల్లు తన మనసుకు నచ్చిన విధంగా నిర్మించుకోవాలన్న కోరిక నెరవేరిందని అభిమానులకు శుభవార్త తెలిపింది. తాజాగా శ్రీముఖి తన కుటుంబ సభ్యులతో కలిసి నూతన గృహ ప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోల్లో శ్రీముఖి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఉన్నారు. వంట ఇంటిలో తల్లితో పాటు శ్రీముఖి పాలు పొంగిస్తున్న ఫోటో కనిపిస్తుంది. మొత్తానికి తన ఇష్టాలకు అనుగుణంగా ఉన్న ఇంట్లోకి అడుగు పెట్టిన యాంకర్ శ్రీముఖికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శ్రీముఖి పలు షోల్లో యాంకర్ గా ఉంటూ.. వెండితెరపై సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్.