బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని గ్లామరస్ బ్యూటీలలో యాంకర్ శ్యామల ఒకరు. యాంకర్ గా క్రేజ్ ఉన్నప్పటికీ, బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది శ్యామల. మొదటినుండి ఓవైపు యాంకర్ గా షోస్, ఈవెంట్స్ చేస్తూనే.. అడపాదడపా సినిమాలలో కూడా నటిస్తోంది. యాంకర్ గా సక్సెస్ అయిన శ్యామల.. నటిగా మాత్రం నిలబడలేకపోయింది. కానీ.. బుల్లితెరపై, సోషల్ మీడియాలో తన గ్లామర్ షోతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో టీవీ షోస్ లో కూడా పెద్దగా కనిపించట్లేదు. కానీ.. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్ లో మెరుస్తోంది.
ఇక సోషల్ మీడియాలో మిలియన్ కి పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్యామల.. గ్లామర్ విషయంలో మాత్రం హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తోంది. పైగా ఈ మధ్యకాలంలో మతిపోయే అందాల షోతో నెటిజన్స్ కి, ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇస్తోంది. అయితే.. గతంలో శ్యామల ఎంత బొద్దుగా ఉండేదో తెలుసు కదా.. కొంతకాలంగా వర్కౌట్స్, డైట్ చేసి నాజూకుగా తయారైంది. అప్పటినుండి అదిరిపోయే గ్లామరస్ ఫోటోషూట్స్ తో నెట్టింట హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే శ్యామల.. తన కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ అప్ డేట్స్ కూడా షేర్ చేస్తుంటుంది.
ఇదిలా ఉండగా.. ఎప్పటికప్పుడు తన అందాలతో ఆకట్టుకునే ఈ బ్యూటీ.. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్ కి పైగా ఫాలోయర్స్ ని సంపాదించుకుంది. శ్యామల పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. సీరియల్ నటుడు నరసింహాను లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. శ్యామలకి ఓ కొడుకు. అయితే.. తాజాగా బేబీ పింక్ కలర్ శారీలో శ్యామల కొత్త పిక్స్ పోస్ట్ చేసింది. ఎంతో అందంగా శిల్పంలా ముస్తాబైన శ్యామలని ఆ గ్లామరస్ పిక్స్ లో చూస్తూ ఫ్యాన్స్ పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్యామల శారీ పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇక నటిగా రీసెంట్ గా మాచెర్ల నియోజకవర్గం మూవీలో నటించింది. మరి యాంకర్ శ్యామల లేటెస్ట్ ఫోటోషూట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.