అనన్యా పాండే.. ఇలా చెప్పేకంటే లైగర్ బ్యూటీ అంటే తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుస్తుంది. తెలుగులో డెబ్యూ చేసిన తొలి చిత్రమే బ్యాక్ ఫైర్ అయ్యింది. ఎన్నో అంచనాలు పెట్టుకుని టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగా.. అనన్యకి ఆశించిన ఫలితం రాలేదు. ఈ సినిమా కేవలం అనన్యా పాండేకే కాదు.. పూరీ- విజయ్ దేవరకొండ- ఛార్మీలకు కూడా ఒక పీడకలలాంటిదే. అయితే ఈ సినిమా పరాజయం నుంచి ఈ భామ చాలా త్వరగానే కోలుకున్నట్లు కనిపించింది. సినిమా ఫ్లాప్ అని తెలిసే సమయానికే అనన్య వెకేషన్లో ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది.
తను మళ్లీ ఎప్పుడు స్ట్రైట్ తెలుగు సినిమాలో నిటస్తుందో చెప్పడం కష్టమనే అంటున్నారు. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఫొటోషూట్లు, బ్రాండ్ ప్రమోషన్స్, రీల్స్ అంటూ సందడి చేస్తూ ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో తన అభిమానులతో టచ్ లో ఉంటూ ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ బోల్డ్ ఫొటో షూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ప్యాంట్ లేకుండా వైట్ డ్రెస్సులో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఒక రూమ్ లో ఒంటరిగా నేలపై కూర్చొని కైపెక్కించే చూపులతో కుర్రకారుకు పిచ్చెక్కిిస్తోంది.
ఇంక సినిమాల విషయానకిి వస్తే.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పతీ పత్నీ ఔర్ ఓ, కాలీ పీలీ, గెహ్రాయియా, లైగర్ సినిమాల్లో నటించింది. ఖో గయే హమ్ కహ, డ్రీమ్ గర్ల్ 2 సినిమాల్లో నటిస్తోంది. తెలుగు ప్రేక్షకులను తన అందాలతో కట్టిపడేసిన ఈ భామ మళ్లీ ఎప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కొందరు ఈ అమ్మడి ఫొటోషూట్ పై వ్యంగాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అంటూ ఖలేజా సినిమా డైలాగులు చెబుుతున్నారు.