తెలుగులో కూడా “మీలో ఎవరు కోటీశ్వరుడు” అనే పేరుతో కార్యక్రమంలో ప్రసారమవుతున్న సంగతి మనందరికి తెలిసిందే.ఈ ప్రోగ్రామ్ కి గత మూడు సీజన్లు కింగ్ అక్కినేని నాగార్జున .. ఒక సీజన్ మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా నిర్వహించారు. ప్రస్తుతం ఇదే కార్యక్రమాన్ని ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే పేరుతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం పలు భాషల్లో కూడా వివిధ పేర్లతో నిర్వహిస్తున్నారు. వీటన్నిటికి మూలం ‘కౌన్ బనేగా కరోడ్ పతి’. కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది బిగ్ బీ అమితాబ్.
వినిపించేది ఆయన గంభీరమైన స్వరమే. కేబీసీ గేమ్ షో ఇప్పటికే 12 సీజన్స్ లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 13వ సీజన్ నడుస్తుంది. ఈ షో ఈ స్థాయిలో ప్రాచుర్యం పొందడానికి అమితాబ్ బచ్చన్ హోస్టింగే కారణం. కేబీసీ 13వ సీజన్ లో ఇటీవల వచ్చిన ఒక ఎపిసోడ్ లో అమితాబ్ కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. బిగ్ బీ అలా కన్నీరు పెట్టుకోవటానకి కారణం ఏమిటో తెలుసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా120 దేశాల్లో పలు పేర్లతో ప్రసారమై.. విజయవంతమైన ఈ షో ఇండియాలో అమితాబ్ చేతితో మొదలైంది. హిందీలో మొదలైన కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం ఇప్పుడు పలు భారతీయ భాషల్లో సక్సెస్ ఫుల్ గా సీజన్ల మీద సీజన్లు నడుస్తుంది.ఎందరో సామన్యూల జీవితల్లోని ఆటుపోటులు అమితాబ్ ఈ షో ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఎందరో పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకున్నారు.కేబీసీ 13వ సీజన్ లో లేటెస్టుగా వచ్చిన ఒక ఎపిసోడ్ లో అమితాబ్ కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. 1000వ ఎపిసోడ్ లో ప్రత్యేకంగా ఉండాలని భావించిన నిర్వాహకులు దీనికి అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్, మనవరాలు నవ్య నవేలి నందాను ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేబీసీలో బిగ్ బీ జర్నీని గుర్తు చేస్తూ.. ఓ స్పెషల్ వీడియోని ప్లే చేయగా అది చూసి అమితాబ్ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన అమితాబ్.. తాను కేబీసీకి సైన్ చేసే సమయంలో.. వెండి తెర మీద నటించిన స్టార్స్.. బుల్లితెరపైకి వస్తే ఇమేజ్ తగ్గిపోతుందని అందరూ అన్నారని.. కానీ ఆ సమయంలో తనకు పెద్దగా పని లేదని.. ఆ సమయంలో తాను ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో చేయడానికి అంగీకరించానని.. కానీ, ఇలా ఇన్ని సీజన్లు ఇంత సక్సెస్ ఫుల్ గా ఈ షోను ఆదరిస్తారని అనుకోలేదని అమితాబ్ బచ్చన్ తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.