బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటుడిగా, హోస్ట్ గా మనందరికి సుపరిచతమే. ఎన్నో వైవిధ్యకరమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్తానాన్ని ఏర్పర్చుకున్నారు. తాజాగా బిగ్ బి ఓ వ్యక్తి బైక్ పై ప్రయాణిస్తున్న ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరి లగ్జరీ కార్లు ఉన్న తను బైక్ పై ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది? అసలు ఆ ఫోటో వెనుక ఉన్న స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

బాలావుడ్ మెగాస్టార్ గా చెప్పుకునే బిగ్ బి ఓ సినిమా షూటింగ్ కోసం తన కార్లో బయలుదేరాడు. ఇలా వెళ్లే క్రమంలో ట్రాఫిక్ లో చిక్కుకు పోయారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ సామాన్య వ్యక్తిని లిఫ్ట్ అడిగారు. బిగ్ బి అడగడమే ఆలస్యం వెంటనే ఆ బైకర్ తన బైక్ పై లిఫ్ట్ ఇచ్చాడు. దీంతో అమితాబ్ అనుకున్న సమయానికి షూటింగ్ జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. అయితే తనకు లిఫ్ట్ ఇచ్చిన వాహనదారుడికి బిగ్ బి ఇన్ స్టాగ్రామ్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. ‘నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ సోదరా. నువ్వు ఎవరో నాకు తెలీదు. కానీ సమయానికి లిఫ్ట్ ఇచ్చి నన్ను షూటింగ్ జరిగే ప్రదేశానికి తీసుకెళ్లావు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోకుండా సాయం చేశావు’ అంటూ తనకు సాయం చేసిన వ్యక్తికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన బిగ్ బి ఫ్యాన్స్ ఇంతటి మహోన్నతమైన వ్యక్తి ఓ సామాన్యుడిని లిఫ్ట్ అడిగి వెళ్లడం చాలా గొప్ప విషయమని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అమితాబ్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కె’లో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి టెలివిజన్ షో కు హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే.