తెలుగు ఇండస్ట్రీలో మెగా హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. గంగోత్రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ గా మారారు. టాలీవుడ్ లో అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతో ఉంది.. అదే విధంగా ఫ్యాన్స్ తో తన ఫ్యామిలీ విషయాలు.. మూవీ విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మాద్యమాల ద్వారా షేరు చేస్తుంటాడు.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నాడు ఐకాన్ స్టార్. కరోనా వలన ఆగిన చిత్ర షూటింగ్ ప్రస్తుతం కాకినాడలో షూటింగ్ జరుపుకుంటుంది. కాకినాడ, మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తారని తెలిసింది. ఒక్క పాట మినహా చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. మొత్తానికి ఈ నెలాఖరుకు ‘పుష్ప: ద రైజ్’ చిత్రీకరణ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ‘పుష్ప’చిత్రీకరణ మధ్యలో లభించిన విరామ సమయంలో కాకినాడలోని ఓ థియేటర్‌లో ‘సీటీమార్’ మూవీ తిలకించారు బన్ని.
అల్లు అర్జున్ షూటింగ్ విరామ సమయంలో షికారు చేయడం చాలా ఇష్టం. తాజాగా అల్లు అర్జున్ సింప్లిసిటీకి కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్ గోకవరం దగ్గర రోడు సైడ్ టిఫిన్ సెంటర్‌లో టిఫిన్ చేయడం.. తన సిబ్బంది వద్ద డబ్బు తీసుకొని హూటల్ యజమానికి స్వయంగా ఇవ్వడం ఈ వీడియోలో చూడవొచ్చు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.