NBK107: ‘అఖండ’ విజయం తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ.. క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘NBK107’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని సెట్ లో జరుగుతోంది. అయితే.. తాజాగా బాలయ్య మూవీ సెట్ లో అల్లరి నరేష్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రయూనిట్ సందడి చేశారు.
ఇక అల్లరి నరేష్ – బాలయ్య కలిసి సెట్ లో సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాస్ కి కేరాఫ్ అయినటువంటి బాలయ్య, క్లాస్ సినిమాలతో దూసుకుపోతున్న నరేష్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. బాలయ్య సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో అల్లరి నరేష్ టీమ్ సెట్ కి వచ్చారు. అయితే.. బాలయ్య సినిమా సెట్ కి దగ్గరలోనే అల్లరి నరేష్ `ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం` సినిమా షూటింగ్ జరుగుతుండటం విశేషం.
ఈ క్రమంలో సండే షూటింగ్ కాస్తా సందడి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. నరేష్ టీమ్ తో బాలయ్య కాసేపు సరదాగా ముచ్చటించినట్లు తెలుస్తుంది. నరేష్ తోపాటు కమెడియన్ ప్రవీణ్, ఇతర ఆర్టిస్టులు, టెక్నిషియన్లను ఫోటోలలో చూడవచ్చు. అయితే.. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఫోటోలలో బాలయ్య కొత్త లుక్ హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే ‘NBK107’ సంబంధించి బాలయ్య ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులలో అంచనాలు పెంచేసింది. వైట్ అండ్ వైట్ లో పవర్ ఫుల్ గా కనిపించాడు బాలయ్య. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీస్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరి ఈ ఏడాది విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయనుందట. మరి బాలయ్య – అల్లరి నరేష్ ల ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Team #ItluMaredumilliPrajaneekam met Natasimham #NandamuriBalakrishna & took the blessings of him, as they both shooting at nearby places✨#IMP @allarinaresh @anandhiactress @raajmohan73 @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @lemonsprasad @abburiravi @SricharanPakala @RaamDop pic.twitter.com/x0lPiiQdV1
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) July 3, 2022