అమిత్ తివారి.. నటుడిగానే కాక.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా కూడా తెలుగువారికి దగ్గరయ్యాడు. తాజాగా నల్లమల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అమిత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇలా ఉండగా.. తాజాగా అమిత్ ఈటీవీలో ప్రసారం అయ్యే అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో పాటు మరో బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు అలీ రెజా కూడా ఉన్నారు. ఇక ఇంటర్వ్యూలో అమిత్ తన గురించి పలు ఆసక్తికర వివరాలు పంచుకున్నాడు. రాజమౌళి.. విక్రమార్కుడు సినిమా తనకు ఎంతో గుర్తింపు తెచ్చిందని… ఆ సమయంలో జనాలు విక్రమార్కుడు సినిమాలో తన పాత్ర చూసి ఎలా స్పందించారో తెలిపాడు.
ఇది కూడా చదవండి: ఇండస్ట్రీలో జరిగిన అవమానం బయటపెట్టిన యాక్టర్ సత్యప్రకాష్
ఈ సందర్భంగా అమిత్ మాట్లాడుతూ.. ‘‘నాకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం లేదు. నా జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటన విక్రమార్కుడు సినిమా విడుదల తర్వాత చోటు చేసుకుంది. ప్రేక్షకులతో కలిసి సినిమా చూడ్డానికి నేను, రాజమౌళి గారు సుదర్శన్ 70 ఎంఎం థియేటర్‌కు వెళ్లాం. నాతో పాటు మా నాన్న కూడా వచ్చారు. వెనక సీట్లో రాజమౌళి కూర్చున్నారు. నేను, మా నాన్న.. ముందు వరుసలో కూర్చున్నాం. ఈ సినిమాలో నేను పైనుంచి పడటంతో.. మెడకు ఉరి పడి మరణిస్తాను. ఆ సీన్ సమయంలో మా ముందు కూర్చున్న కుర్రాళ్లు.. వాళ్ల చేతిలో ఉన్నవి డబ్బులో, చిప్సో.. తెలియదు కానీ వాటిని విసిరేసి.. నోటితో చెప్పలేని తిట్లు, పచ్చి బూతులు తిట్టారు. వాళ్ల రియాక్షన్ చూసి నేను భయపడి కిందకు వంగిపోయా. అప్పుడు రాజమౌళి సార్ నన్ను చూసి.. వాళ్లు తిడుతున్నారంటే.. నీ క్యారెక్టర్ సక్సెస్ అయ్యింది అని చెప్పారు’’ అని తెలిపాడు.
ఇది కూడా చదవండి: ఆ స్టార్ హీరో నా చెంప పగలగొట్టారు: హీరో వెంకట్‘‘ఇక సినిమా అయిపోయేదాకా ఉంటే.. కొడతారని బయటకు పారిపోయి.. కారు దగ్గరకు పరిగెత్తా. ఆ సమయంలో నన్ను చూసిన కొందరు యువకులు నా దగ్గరకు వచ్చి.. ఏం చేశారు సార్ అంటూ ప్రశంసించారు. వాళ్లు వెళ్లగానే.. నేను అక్కడి నుంచి జంప్ అయ్యా. అదే పాత్ర హిందీ, తమిళ్‌లో నేనే చేశా. ఆ పాత్ర నా జీవితంలో ఎన్నటికి ప్రత్యేకం’’ అన్నాడు అమిత్ తివారి. అతడి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: హీరో శ్రీకాంత్ అరిచాడు! ఆ రేప్ సీన్ ఇబ్బంది పెట్టింది: హీరోయిన్ మాళవిక
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.