అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్ గురించి తెలుగునాట పరిచయం అవసరం లేదు. తన మార్క్ నటనతో సుమంత్ హీరోగా మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు సుమంత్. ఇక త్వరలోనే ఈ సీనియర్ హీరో లీడ్ సపోర్టింగ్ రోల్స్ కూడా చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఇలా రీల్ లైఫ్ లో సుమంత్ ప్రయాణం సజావుగానే సాగిపోతోంది. అయితే.., రియల్ లైఫ్ లో మాత్రం సుమంత్ ఎదుర్కొన్న పరిస్థితిలు వేరు. తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డిని అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సుమంత్. కానీ.., కొన్నేళ్ళకే వీరి వివాహ బంధం వీగిపోయింది. ఇక అప్పటి నుండి.. అంటే గత 15 సంవత్సరాల నుండి ఒంటరిగానే ఉంటూ వస్తున్నాడు సుమంత్. ఎన్నిసార్లు పెళ్లి ప్రస్తావన వచ్చినా సుమంత్ వాటిని ఖండిస్తూనే వచ్చాడు. అయితే.., అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పుడు సుమంత్ నిజంగానే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడుట. ఇప్పటికే ఈ పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయన్న టాక్ వినిపిస్తోంది.
సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు పవిత్ర. అయితే.. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమా? లేక ప్రేమ వివాహమా? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటి అంటే.. సుమంత్, పవిత్ర జంటగా కలిసే స్నేహితులకు, బంధువులకు వెడ్డింగ్ కార్డ్స్ కూడా అందిస్తున్నారు. ఆ వెడ్డింగ్ కార్డ్ పిక్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘SP’ అనే లెటర్స్ ను హైలెట్ చేస్తూ వీరి వెడ్డింగ్ కార్డ్ ఉంది. దీంతో.., త్వరలోనే సుమంత్ ఓ ఇంటివాడు కావడం ఖాయం అయిపోయింది. మరి.. ఇన్నాళ్ల తరువాత రియల్ లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సుమంత్ కి కామెంట్స్ రూపంలో మీరు కూడా విషెష్ తెలియచేయండి.