Akira Nandan: పవన్ కల్యాణ్ వారసుడిగా అకీరా నందన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తమ హీరో కుమారుడికి సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ తెలిసినా ఫ్యాన్స్ సందడి చేసేస్తుంటారు. గత కొద్దిరోజుల నుంచి అకీరా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాడు. ముఖ్యంగా పియానోపై ‘‘దోస్తీ’’పాట అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. తాజాగా, అకీరా హైదరాబాద్ లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 12వ తరగతి పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే స్కూలింగ్ పూర్తయిన సందర్భంగా ఫేర్ వెల్ లాంటిది ఏర్పాటు చేశారు. ఈ ఫేర్ వెల్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. ఈ సందర్భంగా అకీరా తన స్నేహితులకు అంకితం చేస్తూ.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ సినిమాలోని దోస్తీ పాటను పియానోపై వాయించాడు. పియానోపై చాలా చక్కగా పాటను పలికించాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూస్తున్న ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పవన్ కల్యాణ్ కుమారుడు వెరీ టాలెంటెడ్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. కాగా, ఈ ఫేర్‌వెల్ పార్టీలో తండ్రి పవన్ కళ్యాణ్, తల్లి రేణుదేశాయ్, చెల్లి ఆధ్యలతో అకీరా కలిసి దిగిన ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. పవన్ ఫ్యామిలీతో కలిసున్న ఈ ఫొటోలను చూసిన ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. కామెంట్లతో తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. మరి, ఫ్రెండ్స్‌కు ‘‘దోస్తీ’’ పాట అంకితం ఇచ్చిన అకీరాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Here’s the full video that Akira Playing Dosti song from #RRRMovie ❤️🔥 pic.twitter.com/aIKLzmrWYh
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) May 24, 2022
ఇవి కూడా చదవండి : Akira Nandan: అకీరా నందన్ స్కూల్ ఈవెంట్ కి హాజరైన పవన్ కళ్యాణ్.. పిక్స్ వైరల్!