అక్కినేని నట వారసుడు అఖిల్ వెండి తెరపై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి చాలానే కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు 4 చిత్రాల్లో నటించిన ఈ యంగ్ హీరోకు ఇప్పటిదాకా ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా రాలేదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంటే.. మరో మూవీ ఏజెంట్ సెట్స్‌పై ఉంది. ఈ క్రమంలో అఖిల్ తన లుక్ ను పూర్తిగా మార్చేయడం ఆసక్తికరంగా మారింది. డాషింగ్ లుక్ లో కన్పిస్తున్న పిక్ ఒకటి ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
గడ్డం, జుట్టుతో అఖిల్ కొత్త మేకోవర్ తో సరికొత్తగా కనిపిస్తున్నాడు. అయితే ఈ లుక్ కూడా సురేందర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఏజెంట్’ కోసమేనని తెలుస్తోంది. మొదటి నుంచి ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ ని మార్చుకొని, కొత్త గెటప్ లో కనిపిస్తున్నాడు. ఇందులో ఓ సీరియస్ పాత్ర చేయబోతున్న అఖిల్ దర్శకుడు చెప్పిన రిస్కలన్నీ కూడా చేసేస్తున్నట్టుగా తెలుస్తోంది, ఇదిలావుంటే, అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌లో అఖిల్ ఓ చిత్రం చేయబోతున్నాడని వినిపిస్తోంది. ఈ సినిమాని శ్రీనువైట్ల డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇందులోనూ కొత్త మేకోవర్ తో అఖిల్ కనిపిస్తాడని ప్రచారం జరగుతోంది.
ఇక అఖిల్ తాజా మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో లవ్ ట్రాక్ చాల బాగా వచ్చిందని.. ముఖ్యంగా లవ్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ కూడా సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది.అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అఖిల్ కెరీర్ కి కీలకం కానుంది.చూడాలి మరి దీంతో అయినా లక్ కలిసి వస్తుందో.