Akash Puri: సినీ తారలు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో, సినిమా ఈవెంట్స్ లో తదుపరి సినిమా టైటిల్స్ ని లీక్ చేయడం చూస్తుంటాం. అలాగే కొందరు సినిమాలోని క్యారెక్టర్స్ లేదా వేరేదైనా లీక్ చేస్తుంటారు. మరికొందరైతే తమ సినిమాల గురించి మాట్లాడే క్రమంలో వేరే సినిమాల విషయాలను షేర్ చేసుకుంటారు. అదంతా వారు కావాలని చేయకపోయినా.. ఒక్కసారి నోట్లో నుండి బయటికొస్తే చాలు ఫ్యాన్స్ కి పండగే అవుతుంది.
తాజాగా టాలీవుడ్ యువనటుడు ఆకాష్ పూరి.. తాను నటించిన కొత్త సినిమా ‘చోర్ బజార్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు. చోర్ బజార్ మూవీ జూన్ 24న థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఆ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆకాష్.. ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆదిపురుష్ గురించి చెప్పేశాడు.
ప్రభాస్ కి, పూరి జగన్నాథ్ ఫ్యామిలీకి మధ్య మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ మూవీ నుండి డార్లింగ్, పూరి మధ్య ఆ రిలేషన్ కంటిన్యూ అవుతోంది. అయితే.. పూరి వారసుడు ఆకాష్ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీని ప్రభాస్ ఏ స్థాయిలో ప్రమోట్ చేశాడో చెప్పక్కర్లేదు. ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు ఏకంగా రొమాంటిక్ టీమ్ తో ఇంటర్వ్యూ కూడా చేశాడు.
ఈ క్రమంలో ఆకాష్.. ప్రభాస్ తో ఉన్న బాండింగ్ గురించి చెబుతూ.. రొమాంటిక్ మూవీ ప్రమోషన్స్ టైంలో ప్రభాస్ గారు మాతో డే అంత స్పెండ్ చేశారు. అప్పుడు మాకు ఆదిపురుష్ మూవీ విజువల్స్ కొన్ని చూపించారు. ఆ విజువల్స్ లో ప్రభాస్ మాములుగా లేడు. ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఓ రేంజిలో ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆదిపురుష్ గురించి ఆకాష్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఆకాష్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.