సినిమా హీరోలు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనే ఉద్దేశంతో వరసగా సినిమాలు చేస్తుంటారు. కానీ ఆయా హీరోల ఫ్యాన్స్ మాత్రం.. రెచ్చిపోతుంటారు. అభిమానం పేరుతో కొన్నిసార్లు నానా హంగామా చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్దగా కనిపించదు. కానీ తమిళనాడులో అజిత్ ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ మాత్రం హద్దులు దాటేస్తుంటారు. కొన్నిసార్లు విపరీతంగానూ ప్రవర్తిస్తుంటారు. ఇక ఇప్పుడు జరిగిన ఓ ఇన్సిడెంట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా కూడా చేస్తారా అనిపించేలా చేస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులో విజయ్ కు ఎంత క్రేజ్ ఉంటుందో, అజిత్ కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. వీరిద్దరూ సినిమాల పరంగా ఎలా ఉన్నప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే ఈ సంక్రాంతి విజయ్ ‘వారిసు’ (తెలుగులో వారసుడు), అజిత్ ‘తునివు’ (తెలుగులో తెగింపు).. జనవరి 11నే తమిళంలో రిలీజ్ కానున్నాయి. ఈ సందర్భంగా థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. అంతెత్తు బ్యానర్లతో తమ హీరోపై అభిమానాన్ని చూపిస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఓ మల్టీప్లెక్స్ లో విజయ్, అజిత్ సినిమాలకు స్క్రీన్స్ కేటాయించే విషయంలో సమస్య తలెత్తింది. తొలి స్క్రీన్ అజిత్ సినిమాకు, రెండో స్క్రీన్ విజయ్ మూవీకి ఇవ్వగా.. మిగిలిన మూడో స్క్రీన్ ఎవరి చిత్రానికి ఇవ్వాలి అనే దగ్గర గొడవ మొదలైంది! ఆయా హీరోల ఫ్యాన్స్.. తమకు కావాలంటే తమకు కావాలని డిమాండ్ చేశారు. మాటామాటా పెరిగింది. దీంతో జోక్యం చేసుకున్న థియేటర్ యాజమాన్యం.. టాస్ వేసి సమస్యని పరిష్కరించింది. అజిత్ ఫ్యాన్స్ గెలవడంతో.. ‘తునివు’ మూవీకి స్క్రీన్ కేటాయించారు. ఇదెక్కడ జరిగిందనేది కరెక్ట్ గా తెలియట్లేదు కానీ ఓ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. మరి సినిమా కోసం టాస్ వేయడంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.