ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోని గుర్తుపట్టారా? అస్సలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు కదా. అతనొక సూపర్ స్టార్. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ అందం గురించి పట్టించుకోకుండా చాలా సింపుల్ గా ఉంటున్నారు. ఈయన ఎవరంటే?
నెరిసిన గడ్డం, కళ్ళ కింద ముడతలు, వాడిపోయిన ముఖంతో ఉన్న ఇతనొక ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా? విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. కానీ పట్టి పట్టి చూస్తేనే గానీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అయితే ఫ్యాన్స్ మాత్రం తమ హీరోకి ఏమైందంటూ ఆందోళన చెందుతున్నారు. హీరో అన్నాక గ్లామర్ చాలా ముఖ్యం బిగిలు అని అంటారు. కానీ ఈ హీరో మాత్రం సినిమా వరకే గ్లామర్.. రియల్ లైఫ్ లో ఒరిజినాలిటీని చూపిస్తారు. మిగతా హీరోలు అయితే వేసుకునే బట్టల నుంచి హెయిర్ స్టైల్ వరకు అన్ని కొత్తగా ట్రై చేస్తుంటారు. మరికొందరు అయితే 60 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోస్‌కు పోటిగా నిలుస్తున్నారు. బాడీ ఫిట్ నెస్ కోసం కసరత్తులు చేస్తూ..పాతికేళ్ళ కుర్రాడిలా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. వయసుని దాచే ప్రయత్నం చేస్తుంటారు.
అయితే.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మాత్రం తన ఒరిజినాలిటీని చూపిస్తూ.. కొత్త లుక్‌తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. అజిత్ స్టైల్, డ్యాన్స్, గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళంలోనే కాదు తెలుగు, హిందీలో కూడా అజిత్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను చేసే చిత్రాల్లో కొన్ని ఒరిజనల్ గెటప్‌తోనే చేశాడు. ప్రస్తుతం అజిత్ సినిమాలను పక్కన పెట్టి ప్రపంచాన్ని చుట్టే పనిమీద ఉన్నాడు.. ఇప్పటికే పలు రాష్ట్రాలు తిరుగుతూ.. తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అజిత్‌కు వెకేషన్స్‌కి వెళ్ళడం చాలా ఇష్టం, వీలు చిక్కనప్పుడల్లా కొన్ని ప్రాంతాలను, ప్రదేశాలను సందర్శిస్తుంటాడు. ఇక తాజాగా అజిత్ లేటెస్ట్ ఫోటోస్ కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో అజిత్‌ను చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.
నెరిసిన జుట్టు, కళ్ల కింద ముడతలు వాడిపోయిన ముఖంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అజిత్ వయసు 52 సంవత్సరాలు. కానీ.. ఫోటోలో మాత్రం 70 సంవత్సరాల వృద్దుడిలా కనిపిస్తున్నాడు. ఇది చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. ప్రాంతాలు తిరుగుతూ ఉండటం వల్ల ముఖం వాడిపోయి ఉండచ్చని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు అజిత్‌కు ఆరోగ్యసమస్యలు వచ్చాయని అనుకుంటున్నారు. అజిత్‌ను ఈ గెటప్‌లో చూసే సరికి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారని చెప్పవచ్చు. ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే.. ‘విదాముయార్చి’ అనే కొత్త చిత్రం చేస్తున్నాడు. తిరుమేని దర్శకత్వం వహిస్తున్న, ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా తెరకెక్కబోతుందని తెలుస్తొంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాష్ కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2024లో ఈ సినిమా విడుదల కానుంది.
Latest pics of #AK With His Co-Riders From Norway.. 👌❤️#VidaaMuyarchi || #Ajithkumar pic.twitter.com/9MifxWsVAq
— AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) August 6, 2023