కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ ఇటీవలే తమ 18 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అయితే.. విడాకులు ప్రకటించారు కానీ, అసలు విడాకులు ఎందుకు తీసుకున్నారు? అనేది కారణాలు తెలియలేదు. ఇద్దరూ కూడా ప్రస్తుతం ఎవరి దారిలో వారు సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. తాజాగా ఐశ్వర్య ఓ మీడియా ఇంటర్వ్యూలో విడాకులపై స్పందించింది.
ఐశ్వర్య మాట్లాడుతూ.. “జీవితంలో ఆటుపోట్లు అనేవి వస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొని మనం ముందుకు వెళ్లాలి. చివరికి ఏది దక్కాలో అదే మనకు దక్కుతుందని నేను నమ్ముతాను. ప్రేమ అనేది కామన్ ఎమోషన్. అది ఒక వ్యక్తికి లేదా వ్యక్తిగతానికి సంబంధించినది కాదు. నేను ఎదిగినా కొద్దీ నాలో ప్రేమకు అర్థం మారుతూ వచ్చింది.నేను నా తల్లిదండ్రులను, నా పిల్లలను ప్రేమిస్తున్నాను. కాబట్టి, నా ప్రేమ ఒకరితోనే ఆగిపోయేది కాదు” అంటూ చెప్పుకొచ్చింది. ఐశ్వర్య అలా అనేసరికి.. సెకండ్ మ్యారేజ్ పై చెప్పకనే చెప్పిందంటున్నారు నెటిజన్లు. అయితే.. ఐశ్వర్య ఎక్కడా కూడా ధనుష్ పేరు, ప్రస్తావన తేకపోవడంతో ఇక వీరిద్దరూ కలిసే అవకాశం లేదని చెబుతూనే, ధనుష్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ధనుష్ – ఐశ్వర్య పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. అలాగే 18 ఏళ్ల వైవాహిక బంధంలో స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా ఉంటూ వచ్చాము. ఇక మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా డివోర్స్ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని, అలాగే మాకంటూ కొంత ప్రైవసీ ఇవ్వాలని ధనుష్, ఐశ్వర్య క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వీరిద్దరూ ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉన్నారు. మరి ఐశ్వర్య కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.