ప్రస్తుతం దేశం మొత్తం పాన్ ఇండియా హవా నడుస్తోంది. అందులోనూ మరీ ముఖ్యంగా దక్షిణాది సినిమాలు ఇండస్ట్రీని ఏలేస్తున్నాయి. ఆ ట్రాక్ రికార్డులో మొదటి వరుసలో ట్రిపులార్ ఉంటుంది అని కచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 1070 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇంక షేర్ విషయానికి వస్తే.. 578 కోట్ల వరకు షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వార్తలు బాలీవుడ్‌కు కంటగింపుగానే ఉంటుందని చెప్పాలి. అయితే తారక్– రామ్ చరణ్ ప్రవర్తన చూస్తే సదరు తెలుగు ఆడియన్స్ కు మాత్రం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే అంత బిగ్ సక్సెస్ తర్వాత ఇంత సింపుల్ గా ఎలా ఉన్నారా? అనే ప్రశ్న రాకమానదు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు
నిజానికి అదే బాలీవుడ్ అయినా మరే ఇండస్ట్రీలో అయినా టాప్ హీరోలను తీసుకుంటే.. ఒక సినిమా ఈ స్థాయి కాకపోయినా ఓ మోస్తరు విజయం నమోదు చేసినా కూడా వాళ్లు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సక్సెస్ మీట్ల సంగతేమో గానీ, పార్టీలు, పబ్ లు, షికార్లు అంటూ ఓ ఎంజాయ్ చేసేస్తారు. కానీ, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ మాత్రం అందుకు ఎంతో భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాల వేసుకునే చెర్రీ.. సినిమా సక్సెస్ తర్వాత మాలలో కనిపించడం చూశాం. అయితే ఈ సారి డబుల్ ఫీస్ట్ ఏంటంటే.. ఈసారి మొదటిసారి తారక్ హనుమాన్ మాలలో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఇక్కడ బోటమ్ లైన్ ఏంటంటే.. అతంటి బిగ్ సక్సెస్ సాధించిన తర్వాత ఇద్దరూ టాలీవుడ్ టాప్ హీరోలు ఇంత సింపుల్ గా ప్రవర్తిస్తుండటం చూసి సినీ అభిమానులు మెచ్చుకుంటున్నారు. తారక్- చెర్రీ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Anjaneya Swamy🙏 @tarak9999
Ayyappa Swamy🙏 @AlwaysRamCharan #RamCharan #JrNTR pic.twitter.com/hRM3Dfo9rw— Naveen Cherry (@naveenpari2) April 16, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.