తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా పరిచయమై.. క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ.. హీరోగా మారారు అడవి శేష్. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అడవి శేష్. తాజాగా యంగ్ హీరో అడవి శేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యం లోనే ఇవాళ ఉదయం ఆస్పత్రి లో చేరినట్లు సమాచారం అందుతోంది. హైదారబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి అన్నట్లు గా సమాచారం అందుతోంది.
హీరో అడవి శేష్ కు డెంగ్యూ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి నగరంలో వైరల్ ఫీవర్, డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే డెంగ్యూ వైరస్ సోకినట్లు…. ఇంకా అధికారికంగా వైద్యులు ప్రకటించలేదు. రెండు రోజుల నుంచి అడవి శేషు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో నే ఆస్పత్రి లో చేరారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోంది. అడవి శేష్ ఆరోగ్యానికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా అధికారికంగా ప్రకటించబడుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఈ విషయం తెలుసుకున్న సినిమా ప్రముఖులు, ఆయన అభిమానులు అడవి శేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడవి శేష్ హీరోగా ‘మేజర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది.