‘కల్కి 2898 ఏడీ’ లో ప్రభాస్, విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన ‘కల్కి’ గా కనిపించనున్నాడని క్లారిటీ వచ్చేసింది. అయితే తెలుగులో ప్రభాస్ కంటే ముందు మరో నటుడు ‘కల్కి’ గా కనిపించాడు. అతనెవరో తెలుసా?.
గ్లోబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ ఫిలిం Project K. గతకొద్ది రోజులుగా అసలు ‘ప్రాజెక్ట్ – K’ అంటే ఏంటి? అంటూ ప్రేక్షకులకు పజిల్ విసిరింది టీం. దీంతో.. ‘కల్కి’, ‘కాలచక్ర’, ‘కలియుగ్’ ఇలా పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఎట్టకేలకు సస్పెన్స్‌కి తెరదించుతూ ‘‘ప్రాజెక్ట్ – K’.. ‘K ఫర్ కల్కి’. ‘‘కల్కి 2898 ఏడీ’’ అంటూ టైటిల్ రివీల్ చేశారు. ఇక గ్లింప్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ‘ప్రపంచమంతా అంధకారంలో కూరుకుపోయినప్పుడు ఒక శక్తి ఉదయించింది. చీకటిని, అందుకు కారణమైన రాక్షసుల్ని పారదోలి కొత్త వెలుగుల్ని తీసుక్చొచ్చిన ఆ శక్తి కథ ఏంటనేది ‘కల్కి’ అంటూ క్లుప్తంగా తెలియజేశారు. దీంతో డార్లింగ్.. విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన ‘కల్కి’ గా కనిపించనున్నాడని క్లారిటీ వచ్చేసింది.
అయితే తెలుగులో ప్రభాస్ కంటే ముందు మరో నటుడు ‘కల్కి’ గా కనిపించాడు. అతనెవరో తెలుసా?. టాలెంటెడ్ యాక్టర్, రైటర్ కమ్ డైరెక్టర్ అడివి శేష్. ‘సొంతం’ మూవీలో ఓ స్మాల్ రోల్‌లో కనిపించిన శేష్.. ఆ తర్వాత తనే హీరోగా, రైటర్ కమ్ డైరెక్టర్ కొత్త అవతారమెత్తి ‘కర్మ’ (2010) అనే మూవీ తీశాడు. అప్పటికి వాళ్ల అన్నయ్య సాయి కిరణ్ అడివి తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా పరిచయమయ్యాడు. హైదరాబాద్‌లో పుట్టిన శేష్, శాన్ ఫ్రాన్సిస్కోలో పెరిగాడు. అక్కడే ‘కర్మ’ షూటింగ్ చేశాడు. హాలీవుడ్ యాక్ట్రెస్ జేడ్ టేలర్ హీరోయిన్. అడివి భవానీ, హర్ష్ సింగ్ ప్రొడ్యూసర్స్. శేష్.. ‘దేవ్’ అనే క్యారెక్టర్‌లో కనిపించాడు. సినిమా స్టార్టింగ్‌లోనే ఎండింగ్ ఊహించి చెప్తాడు.
‘అన్యాయం హద్దు లేకుండా పెరిగిపోతున్నప్పుడు విష్ణుమూర్తి కలియుగ దేవుడిగా భూమ్మీదకు వచ్చి, లోకంలోని దుర్మార్గులందర్నీ చంపుతాడు. అన్యాయాన్ని ఆపుతాడు’ అని హీరోయిన్ తండ్రి చిన్నప్పుడు చెప్పగా.. ‘దేవుడు మనకి కూడా కనిపిస్తాడా?’ అని అడగ్గా.. శేష్ కొత్త అవతారంలో కనిపించడంతో సినిమా ఎండ్ అవుతుంది. ఓవరాల్‌గా ‘కల్కి’ క్యారెక్టర్‌కి జస్టిఫికేషన్ ఇచ్చేలా శేష్ ఆలోచన బాగుంది. కానీ అప్పట్లో సినిమా పరిశ్రమ గురించి పెద్దగా తెలియకపోవడం, ఇంత సోషల్ మీడియా లేకపోవడం, సరైన ప్రమోషన్ చేసుకోకపోవడం లాంటి కారణాల వల్ల సినిమా గురించి జనాలకి పెద్దగా తెలియలేదు. 13 ఏళ్ల క్రితమే ‘కల్కి’ గా కొత్త ప్రయత్నం చేశాడు అడివి శేష్.