రొటీన్ గా కి భిన్నంగా వెరైటీగా ఏదైనా చేస్తే దాన్ని ప్రయోగం అంటారు. కానీ.., ఆ ప్రయోగాలు కూడా రొటీన్ అయిపోతే.. స్టార్ హీరో అడవి శేష్ కి ప్రస్తుతం ఇలాంటి సమస్యే వచ్చి పడింది. హీరో అన్నాక అన్ని రకాల జోనర్స్ లో, అన్ని రకాల పాత్రలలో నటించాలి. అప్పుడే స్టార్ డమ్ దక్కుతుంది. ఒక్క జోనర్లోనే చిక్కుకుని వరుసగా సినిమాలు చేస్తే.. కొత్త పాత్రలు రావడం కష్టమైపోతుంది. మూవీ మేకర్స్ కూడా అలాంటి హీరోలతో రిస్క్ చేయాలని భావించరు. దీని ఫలితంగా సదురు హీరోలు ఇండస్ట్రీ నుంచి కొద్దిరోజులకే ఔట్ కావాల్సి వస్తుంది. మరీ అంత బ్యాడ్ సిట్యూయేషన్ రాకపోయినా.., ప్రస్తుతం హీరో అడవి శేష్ పరిస్థితి అలాగే ఉంది. వరుసగా హిట్లున్నా.. ఒక్క జోనర్ సినిమాలే ఈ హీరోకు వస్తుండటం ఇప్పుడు చర్చగా మారింది.
ట్యాలెంటెడ్ హీరోగా పేరు దక్కించుకున్న అడవి శేష్.. వరుసగా థ్రిల్లర్.. యాక్షన్.. క్రైమ్ జోనర్ లకే పరిమితం అవుతున్నాడు. ఇప్పటికే క్షణం, గూడాచారి, ఎవరు వంటి సినిమాలన్నీ కూడా ఇదే జోనర్‌లో వచ్చాయి. ప్రస్తుతం శేష్ చేస్తున్న మేజర్ సినిమా కూడా ఆ స్పెషల్ జోనర్ కు సంబంధించిన మూవీనే. అంతేకాదు ఆ తర్వాత నటించబోతున్న హిట్ 2 కూడా క్రైమ్ థ్రిల్లర్ జోనరే కావడం విశేషం.
అడవి శేష్ కావాలనే ఇలాంటి సినిమాలు ఒప్పుకుంటున్నాడా.., లేక యాదృచ్చికంగా ఇలాంటి అవకాశాలు వస్తున్నాయా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వాస్తవానికి కెరీర్ ఆరంభంలో రొమాంటిక్ లవ్ కమ్ ఎంటర్ టైనర్ సినిమాలను కూడా అడవి శేష్ చేశాడు. కానీ.., అవి అతనికి ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు. ఎప్పుడైతే ఈ జోనర్ కు శేష్ మారాడో అప్పటి నుండి సక్సెస్ లు దక్కించుకుంటున్నాడు. కనుక అడవి శేష్ మిగతా జోనర్స్ ని ఇప్పట్లో టచ్ చేసేలా కనిపించడం లేదు. మరి.. అడవి శేష్ ఫ్యూచర్ లోనైనా అన్ని రకాల జోనర్స్ ని టచ్ చేస్తాడో, లేదో చూడాలి.