అడివి శేష్.. ఈ టాలీవుడ్ యంగ్ అండ్ టాలెండ్ హీరోకి తెలుగులో ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అతను ఎంచుకునే కథలన్నీ ఎంతో భిన్నంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. ఇటీవల హిట్-2తో హిట్టు కొట్టిన అడివి శేష్ ఇప్పుడు గూఢచారి సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే తన ఫ్యామిలీ జరుగుతున్న ఓ వేడుక గురించి తన అభిమానులతో పంచుకున్నాడు. తన చిట్టిచెల్లి పెళ్లి చేసుకుంటున్న తరుణంలో ఆ వేడుకల్లో అడివి శేష్ సందడి చేశాడు. తన ఆనందాన్ని, సంతోషాన్ని తన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.
అడివి శేష్ చెల్లి షిర్లీ అడివి పెళ్లిపీటలెక్కుతోంది. హల్ది, మెహందీ వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫొటోలను అడివి శేష్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. “చెల్లి పెళ్లిలో అమ్మానాన్న, నేను సంతోషంగా గడుపుతున్నాం. మా బావ డేవిన్ ని మా కుటుంబంలోకి ఆహ్వానించబోతున్నాం” అంటూ కోట్ చేశాడు. మరో పోస్ట్ లో “చిట్టి చెల్లికి పెళ్లి జరుగుతోంది. రాజస్థానీ థీమ్ ట్రై చేశాం. పెళ్లి మాత్రం తెలుగు సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది” అంటూ రాసుకొచ్చాడు. ఈ హల్దీ, మెహిందీ వేడుకలకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు సినిమా తారలు, సెలబ్రిటీలు షెర్లీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇంక సినిమాల విషయానికి వస్తే.. హిట్ 2తో అడివి శేష్ హ్యాట్రిక్ హిట్టులు కొట్టాడు. ఇప్పుడు సక్సెస్ ఫుల్ గూఢచారి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. ఈసారి గూఢచారి పరిధిని విదేశాల వరకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్, సినిమాల పరంగా అడివి శేష్ నటన, పాత్రలు ఎంచుకునే తీరుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. నటుడిగానే కాకుండా రైటర్ కూడా అడివి శేష్ తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు.