తెలుగు ఇండస్ట్రీలో నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్న లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. ఈ చిత్రంలో గణేష్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ ప్రమోషన్ బిజీలో ఉన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ వర్ష బొల్లమ్మ విలేఖర్లతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ మూవీలో హీరో ఒక అమాయక పాత్రలో కనిపిస్తాడు.. నా పాత్ర కాస్త డామినేటీవ్ గానే ఉంటుంది. విక్కీ డోనార్ చిత్రం.. స్వాతిముత్యం చాలా తేడాలు ఉన్నాయి. ఈ మూవీ కథనం భిన్నంగా సాగుతుంది. ప్రేమ, వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఇది అందరి మనసు హత్తుకునేలా ఉంటుంది. నేను ఎలాంటి పాత్ర అయినా నటిస్తాను.. కాకపోతే ఎక్కువగా మద్యతరగతి అమ్మాయి లాంటి పాత్రలే ఎక్కువగా వస్తున్నాయి.. అలాంటి పాత్రలు నాకు ఎక్కువ పేరు తీసుకొస్తున్నాయి. ప్రేక్షకులు కూడా నన్ను అలాగే చూడటానికి ఇష్టపడుతున్నారు. నాకు విభిన్నమైన పాత్రల్లో నటించాలని చాలా కోరిక.. నెగిటీవ్ రోల్.. సైకో పాత్ర దొరికితే బాగా చేయగలనని నాకు నమ్మకం ఉంది.
తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ చేస్తున్నాను. అయితే ఎక్కువగా తెలుగు సినిమాల మీదే దృష్టి పెడుతున్నాను. అలాగే అవకాశమొస్తే కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ చేస్తాను. ఆనంద్ దేవరకొండ, గణేష్ బెల్లంకొండ లతో నటించడం మంచి అనుభూతి ఇచ్చింది. గణేష్ తెరపై కొత్త అయినప్పటికీ ఆయన ఇండస్ట్రీ బ్యాగ్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి కనుక పెద్దగా ఇబ్బంది పడిన సందర్భాలు ఏమీ లేవు. ఇటీవల ఆర్ ఆర్ ఆర్ లో కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ గారి నటన చాలా నచ్చింది.. ఆయన అంటే చాలా ఇష్టం. దర్శకులు లక్షణ్ ఎంతో సౌమ్యులు.. నటులకు ఎంతో గౌరవం ఇస్తారు. సితార సంస్థలో తాను పనిచేసినందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ‘స్వాతిముత్యం’ ఎంతో సహజంగా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.