తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సంఘటనలు వివాదాస్పదంగానే మిగిలిపోతుంటాయి. అందులో ఒకటిి అదే బాలకృష్ణ-నిర్మాత బెల్లంకొండ సురేష్ కాల్పుల ఘటన. 2004లో నందమూరి బాలకృష్ణ- నిర్మాత బెల్లకొండ సురేష్ కాంబోలో లక్ష్మి నరసింహ అనే సినిమా వచ్చింది. బాలకృష్ణతో బేటీ అయిన సమయంలో బెల్లకొండ సురేష్‌పై కాల్పులు జరిగాయి.. దీనిపై...
తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సంఘటనలు వివాదాస్పదంగానే మిగిలిపోతుంటాయి. కొన్ని సార్లు వాటికి సరైన కారణాలు పరిశ్రమలోని వారికి కూడా తెలియదు. కానీ అభిమానులను ఆ ప్రశ్నలు వేధిస్తూనే ఉంటాయి. తన హస్కీ లుక్స్‌తో పురుషుల గుండెల్లో పట్టపురాణిగా స్థానాన్ని సంపాదించుకున్న సిల్క్ స్మిత ఆత్మహత్య ఇప్పటికీ మిస్టరీనే. అనేక కథనాలు వస్తున్నప్పటికీ వాస్తవం ఇదని తేల్చని పరిస్థితి. నటి ప్రత్యూష మరణానికి కారణాలు అంతు చిక్కలేదు. అలాగే అమ్మాయిల కలల రాకుమారుడు, యంగ్ అండ్ డైనమిక్ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కూడా ఓ ప్రశ్నార్థకంగా మారిపోయింది. వీరి చావులకు కారణాలు తెలిసి చెప్పడం లేదా.. లేక బయటకు పొక్కనివ్వడం లేదా అన్న సందేహం సగటు అభిమానికి కలుగుతుంది. వీరి మరణాలను ఎప్పుడూ అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అలాగే మరో వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియరాలేదు. అదే బాలకృష్ణ-నిర్మాత బెల్లంకొండ సురేష్ కాల్పుల ఘటన.
2004లో నందమూరి బాలకృష్ణ- నిర్మాత బెల్లకొండ సురేష్ కాంబోలో లక్ష్మి నరసింహ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాతో వీరిద్దరూ సన్నిహితులుగా మారారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత.. జూన్ 4న బాలకృష్ణతో బేటీ అయిన సమయంలో బెల్లకొండ సురేష్‌పై కాల్పులు జరిగాయి. అయితే తొలుత బాలకృష్ణ.. సురేష్ పై కాల్పులు జరిపాడని వార్తలు వచ్చాయి. ఏమైందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. బెల్లంకొండ సురేష్, జ్యోతిష్కుడు సత్యనారాయణ చౌదరిలపై పెద్ద ఎత్తున కాల్పులు జరగడంతో వాళ్లను కూడా హాస్పిటల్ లో చేర్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.ఈ సంఘటన తరువాత బాలయ్య మీద హత్యా యత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. బెల్లంకొండ కూడా బాలయ్యే తన మీద కాల్పులు జరిపినట్టుగా ముందుగా అంగీకరించాడు. కానీ తరువాత మూడో వ్యక్తి కాల్పులు జరిపినట్లు చెప్పారు. అయితే ఈ విషయం ఇప్పటికీ ఇండస్ట్రీలో అంతు చిక్కని వివాదంగానే మిగిలిపోయింది.
అయితే ఈ కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరూ కోలుకున్నారు. తర్వాత వారి పనుల్లో వారు బిజీగా గడిపేస్తున్నారు. ఈ ఘటన జరిగి దాదాపు 20 ఏళ్ల కావొస్తుంది. అయితే ఈ ఘటనపై నటుడు బెల్లకొండ గణేష్ స్పందించారు. బెల్లకొండ సురేష్‌కు ఇద్దకు కుమారులున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, గణేష్ ఇద్దరూ నటనలో రాణిస్తున్నారు. రెండో తనయుడు గణేష్ ఇటీవల హీరోగా హీరోగా పరిచయమయ్యారు. ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు నేను స్టూడెంట్ సర్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు. జూన్ 2న రిలీజ్ అవుతుంది. రాఖీ ఉప్పల పాటి దర్శకత్వంలో నాంది సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. గణేష్‌కు జోడీగా అవంతిక దస్సాని నటిస్తోంది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రీసెంట్ ఇంటర్వ్యూలో భాగంగా బాలకృష్ణ ఇంట్లో జరిపిన కాల్పుల ఘటనపై ఆయన స్పందించారు. ‘కాల్పుల ఘటన జరిగినప్పుడు నాకు నిండా పదేళ్లు కూడా లేవు. అసలు ఏం జరిగిందో కూడా నాకు ఐడియా లేదు. ఆ ఇన్‌సిడెంట్ గురించి నేను, మా ఫ్యామిలీ మెంబర్స్ మా నాన్నతో మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన దాన్ని గుర్తు తెచ్చుకుని దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని మాకు అనిపించింది’ అన్నారు. ఈ వ్యాఖ్యలతో కూడా అక్కడ ఏం జరిగిందో క్లారిటీ లేదన్నది తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో ఆన్సర్ దొరుకుతుందేమో వేచి చూడాల్సిందే.