తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు సురేఖ వాణి. తెలుగులో ఆమె తల్లి, అక్క, వదిన పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె కుమార్తె సుప్రీత కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.. గతంలో టిక్ టాక్ వీడియోలు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ తనదైన శైలిలో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఉంటుంది.
ఇది కూడా చదవండి : కూతురి పిచ్చి చేష్టలపై సురేఖా వాణి
తాజాగా సుప్రీత తన ఇంస్టాగ్రామ్ వేదికగా సంచలన విషయం ప్రకటించారు. లవ్ ప్రపోజల్ కి ఎస్ చెప్పినట్లు వెల్లడించారు. ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘‘అతడి ప్రేమకు ఎస్ చెప్పాను’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక సుప్రీత ప్రేమిస్తున్న అతగాడి వివరాలు తెలుసుకునేందుకు నెటిజనులు తెగ ప్రయత్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి : నువ్వు కన్యవేనా అన్న ప్రశ్నకు సురేఖ వాణి కూతురు సమాధానం
ఇక సుప్రీత ఎస్ చెప్పిన వ్యక్తి పేరు రాకీ జోర్డాన్ కాగా.. అతడు ర్యాపర్ అని తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు కూడా సుప్రీతతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘‘ఆమె ఓకే చెప్పింది’’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరలవుతోంది. సుప్రీతకు అభినందనలు తెలుపుతున్నారు నెటిజనులు.
ఇది కూడా చదవండి : వైన్ గ్లాస్ తో సురేఖా వాణి..పెళ్లి చేసుకుంటానన్న అభిమాని