సినిమా అంటేనే రంగుల ప్రపంచం. అక్కడ రాణించాలి అంటే అందంతో పాటుగా అభినయం.. అందాల ఆరబోత కూడా ఉండాలి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లుంది ఓ తెలుగు హీరోయిన్. అందుకే 66 ఏళ్ల ముసలాడితో లిప్ లాక్ సీన్స్ లో నటించి తాజాగా వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ.
సినిమా ప్రపంచంలో రాణించాలి అంటే.. అందంతో పాటు అభినయం కూడా ఉండాలి. వీటితో పాటుగా కూసింత అదృష్టం కూడా ఉండాలి అంటారు మరికొందరు. అయితే కొంత మంది నటీ, నటులకు అందం, నటన అన్ని ఉన్నా గానీ అవకాశాలు సరిగ్గా రావు. దాంతో హీరోయిన్స్ కొన్ని సార్లు హద్దులు చెరిపేస్తుంటారు. అంటే తమలోని మరోకోణం గ్లామర్ డోస్ ను చూపించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇదే ఫాలో అవుతోంది ఓ తెలుగు బ్యూటీ. 66 ఏళ్ల ముసలాడితో లిప్ లాక్స్ సీన్స్ లో నటించి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది తెలుగు హీరోయిన్.
మిస్ ఇండియా టైటిల్ విన్నర్ క్రేజ్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది వైజాగ్ భామ శోభిత ధూళిపాల. అడవి శేష్ హీరోగా గూఢాచారి, మేజర్ చిత్రాల్లో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్, వెబ్ సిరీస్ లపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది శోభిత. అయితే సినిమాల్లో అవకాశాలు రాకపోవడం వల్లే వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక కొన్నిరోజుల క్రితం హీరో నాగచైతన్యతో డేటింగ్ చేస్తోంది అంటూ వార్తలు కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. ఇప్పటి వరకు దాదాపుగా బోల్డ్ టచ్ ఉన్న పాత్రలే చేసిన శోభితా.. తాజాగా మరింతగా రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా ‘ది నైట్ మేనేజర్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది ఈ భామ. ఇక ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఇందులో కాస్త గ్లామర్ డోస్ పెచ్చింది శోభిత ధూళిపాల. ఈ వెబ్ సిరీస్ లో 30 సంవత్సరాలు ఉన్న శోభిత.. 66 ఏళ్లు ఉన్న బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్ తో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. దాంతో ఆమెను కేవలం ముద్దులు, బికినీ అందాల కోసమే తీసుకున్నారా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఈ నాలుగు ఎపిసొడ్స్ (సిరీస్ 1)లో ఆమె పాత్రకు స్కోప్ పెద్దగా లేదని అభిమానులు అంటున్నారు. ఇక అవకాశాలు లేనంత మాత్రాన మరీ 66 ఏళ్ల ముసలాడితో లిప్ లాక్ సీన్స్ లో నటించడం ఏంటని విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే శోభిత ధూళిపాల పొన్నియిన్ సెల్వన్ 1లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఓటీటీ మూవీలకు శోభిత కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 02 లో కూడా ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. మరి 30 ఏళ్ల శోభిత.. 66 ఏళ్ల వ్యక్తితో రోమాన్స్ చెయ్యడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.