ఇండస్ట్రీలో సెలబ్రిటీ లైఫ్ అంటే.. లగ్జరీ కార్లు, విలాసవంతమైన బంగ్లాలు, విదేశీ టూర్లు.. వాటితో పాటుగా ఫిట్ నెస్ గా ఉండటానికి రకరకాల వర్కౌట్లకు ట్రైనర్లు, వాటికి తగ్గ కాస్ల్టీ డైటింగ్. మరి ఇవన్ని కావాలంటే వేలకు వేలు.. కాదు కాదు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే సినిమాల నుంచి వచ్చే డబ్బును వారి విలాసాలకు ఉపయోగిస్తారు సినీ తారలు. రెగ్యూలర్ గా సినిమాలు చేసే వారికి డబ్బుకు కొదవ ఉండదు. అయితే ఓ బ్యూటీ ఇటు సినిమాలు, అటు యాడ్స్ కూడా ఏమీ చెయ్యట్లేదు. అయినా గానీ రిచ్ లైఫ్ ను లీడ్ చేస్తోంది. అదీకాక ఈ అమ్మడు చివరి సినిమా వచ్చింది 2015లో. అయినప్పటికీ ఈ బ్యూటీ రాయల్ గానే తన లైఫ్ ను లీడ్ చేస్తుంది. మరి సినిమాలు, యాడ్స్ చేయకుండా రాణీలా తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆ బ్యూటీ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
రేఖ.. యావత్ భారత సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. ఛైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ఆరంభించిన రేఖ.. తన నటనతో ఒక్క సంవత్సరంలో 5 సినిమాలు చేసే స్థాయికి ఎదిగారు. 1980-90 దశకాల్లో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పారు రేఖ. అమితాబ్ బచ్చన్ తో పాటుగా స్టార్ హీరోల సరసన నటిస్తూ.. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో రేఖ హీరోయిన్ అంటే.. ఆ సినిమా గ్యారంటీగా హిట్ అనే ముద్ర వేయించుకున్నారు రేఖ. జెమిని గణేషణ్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రేఖ.. అద్భుత నటనతో తనకంటూ ఓ గుర్తింపును ఇండస్ట్రీలో తెచ్చుకుంది.
అయితే ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా ఓ దశ వచ్చాక ఫేడ్ అవుట్ అవ్వడం సాధారణమే. ఇక వయసు మీద పడటంతో కొద్దికొద్దిగా సినిమాలకు దూరం కావడం మెుదలైంది. ఇక రేఖ నుంచి వచ్చిన చివరి చిత్రం 2015లో అమితాబ్, ధనుష్ నటించిన షమితాబ్ అనే చిత్రం కావడం గమనార్హం. ఇక అప్పటి నుంచి రేఖ నుంచి ఏ చిత్రం కూడా రాలేదు. అయితే ఏ యాడ్స్ లో కూడా రేఖ కనిపించిన దాఖలాలు లేవు. అయినప్పటికీ తను ఇప్పటికీ లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తుండటం బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది. రేఖ ఇలా యువరాణిలా జీవించడానికి తనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది బాలీవుడ్ లో తాజాగా వినిపిస్తున్న ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే.. రేఖ, జెమిని గణేషన్ కుతురు అని మనకు తెలిసిన విషయమే.
ఇక పోతే.. రేఖ సినిమాల్లో సంపాదించిన డబ్బుతో ముంబైలో ఖరీదైన ప్రాంతాల్లో అప్పట్లోనే చాలా ప్రాపర్టీస్ ను కొనుగోలు చేసింది. అదీకాక 2012 లో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నుకోబడ్డారు. ఆ ప్రాపర్టీస్ నుంచి నెలవారిగా ఎంతో కొంత డబ్బు వస్తుండటం, రాజ్యసభ సభ్యురాలిగా పెన్షన్ కూడా ఆమె ఖాతాలో పడుతోంది. దాంతో తన లైఫ్ ను ఇప్పటికీ లగ్జరీగా లీడ్ చేసుకుంటూ వస్తోంది లెజండరీ క్వీన్ రేఖ. అయితే స్టార్ హీరో కూతురుకు ఆ మాత్రం డబ్బులు ఉండవా? అంటూ కొంత మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి సినిమాలు, యాడ్స్ చెయ్యకుండా రిచ్ లైఫ్ ను లీడ్ చేస్తున్న రేఖ జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.