ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు ఫ్యాన్స్ కి ఎప్పుడైతే ప్రెగ్నన్సీ అని గుడ్ న్యూస్ చెబుతారో.. అప్పటినుండి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ సీమంతం, బేబీ బంప్ అంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం ట్రెండ్ అయిపోయింది. కన్నడ బ్యూటీ, సౌత్ ఇండియా హీరోయిన్ ప్రణీత సుభాష్ ప్రెగ్నెన్సీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ప్రణీత తరచూ తన బేబీ బంప్ ఫిక్స్ ను ఇన్ స్టా లో పంచుకుంటుంది. అలానే తాజాగా ప్రణీత బాత్ టబ్ లో స్నానం చేస్తూ బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రణీత తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమైన హీరోయిన్. అత్తారింటికి దారేది.. సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. జంతు ప్రేమికురాలైనా ప్రణీత.. అనాథ జంతువులను దత్తత తీసుకోమని చాలా మందిని ప్రోత్సహించింది. అంతేకాకుండా, సోషల్ నెట్వర్క్లో ప్రస్తుత సమస్యలు మరియు రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది. 2021 కరోనా సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార వేత్త నితిన్ రాజ్ ని ప్రేమించి పెళ్లాడింన సంగతి తెలిసిందే. ప్రణీత సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
ఇదీ చదవండి: అప్పట్లో కేవలం డబ్బు కోసమే వాటికి ఒప్పుకున్నా! హీరోయిన్ సోనాలి బింద్రే షాకింగ్ కామెంట్స్!
తను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసింది. ఇప్పుడు తన తాజా ఫోటోను ఇన్స్టాగ్రామ్లో ప్రణీత షేర్ చేసింది. బాత్టబ్లోని బేబీ బంప్ ఫోటోను షేర్ చేసింది. బాపుగారి బొమ్మ ఏంటి ఇలా తయారైంది? బాత్ టబ్ లో స్నానం చేస్తూ ఫోటోలు అవసరమా! అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రణీత బేబీ బంప్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.