Actress Poorna: ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు పూర్ణ అలియాస్ శామ్న ఖాసిమ్. అల్లరి నరేష్ ‘సీమ టపాకాయ్’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో తీసింది తక్కువ సినిమాలైనా తనకంటూ ఓ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్ అయిన పూర్ణ ‘ఢీ’షోతో తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఈ డ్యాన్స్ షోలో జడ్జిగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే, ఉన్నట్టుండి ‘ఢీ’షోనుంచి తప్పుకున్నారామె. అదే ఛానల్‌లో మరికొన్ని షోలు చేస్తున్న కారణంగా ఆ షోకు బ్రేక్ ఇచ్చారేమోనని అందరూ అనుకున్నారు. కానీ, తాను ఆ షో మానేయటానికి వేరే కారణం ఉందని పూర్ణ తెలిపారు.
హగ్స్ ఇవ్వలేకే తాను షోనుంచి తప్పుకున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్యాన్స్ బాగా చేశారని చెప్పిన తర్వాత.. డ్యాన్సర్లకు హగ్స్ ఇవ్వాలని, వారితోపాటు డ్యాన్స్ మాస్టర్లకు, యాంకర్లకు కూడా హగ్స్ ఇవ్వాలని.. అది ఇష్టంలేకే తాను ఢీషోనుంచి బయటకు వచ్చానని అన్నారు. కాగా, ప్రొఫెషనల్ డ్యాన్స్‌ర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన పూర్ణ.. ‘మంజు పొలరు పెన్‌కుట్టి’ అనే మళయాల సినిమాతో వెండితెరపైకి వచ్చారు. ఇప్పటి వరకు 60కిపైగా సినిమాలు చేశారు. త్వరలో తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు పూర్ణ తాజాగా ప్రకటించారు.కాబోయే భర్త షానిద్ అలిని పరిచయం చేశారు. ఇక, షానిద్ అసిఫ్ అలీ విషయానికొస్తే.. ఆయన ఓ వ్యాపార వేత్త.. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈవో. దుబాయ్ వేదికగా వీరి జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వర్క్ చేస్తుంటుంది. ఇది ఒక బిజినెస్ కన్సల్ టెన్సీ, డాక్యుమెంట్ క్లియరింగ్ సర్వీసెస్ అందించే సంస్థ. యూఏఈలో వ్యాపారుల చేసుకునే వారికి డాక్యుమెంటేషన్ పరంగా, అనుమతుల విషయంలో వీరు సర్వీసెస్ అందిస్తుంటారు. అంతేకాకుండా ఇమిగ్రేషన్, వీసా అనుమతులకు సంబంధించి కూడా సేవలు అందిస్తుంటారు. ఇంక షానిద్ అసిఫ్ అలీ ఆస్తుల విషయానికి వస్తే.. కోట్లలోనే ఉంటుందని సమాచారం. మరి, ‘ఢీ’ షోపై పూర్ణ చేసిన కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Actress Poorna: హీరోయిన్ పూర్ణ పెళ్లి చేసుకోబోయే షానిద్ అసిఫ్ అలీ ఆస్తులు ఎంతో తెలుసా?