తెలుగు ఇండస్ట్రీలోకి బాలీవుడ్ బ్యూటీలు ఎంతోమంది ఎంట్రీ ఇచ్చారు.. కానీ కొద్దిమంది మాత్రమే సక్సెస్ సాధించారు. అలాంటి వారిలో అందాల భామ పూనమ్ బాజ్వా ఒకరు. 2005 లో ‘మొదటి సినిమా’తో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి తెరంగేట్రం చుసింది పూనమ్ బజ్వా. ఆ తర్వాత కింగ్ నాగార్జున నటించిన బాస్, అల్లు అర్జున్ నటించిన పరుగు చిత్రంలో హీరోయిన్ అక్కగా నటించింది. తెలుగు, తమిళ, మళియాళ, కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించింది. కానీ.. ఈ అమ్మడికి పెద్దగా పేరు మాత్రం తీసుకురాలేకపోయాయి. కొంతకాలంగా ఇండస్ట్రీకీ దూరమైన పూనమ్ బజ్వా ఇటీవల సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది.
ఇటీవల కొంతమంది నటీమణులు సోషల్ మీడియా వేదిక చేసుకొని తమ ఫ్యాన్స్ కి బాగా దగ్గరవుతున్నారు. సోషల్ మాద్యమాల్లో తమ అందచందాలతో యువతను కట్టిపడేయమే కాదు.. దర్శక, నిర్మాత దృష్టిలో పడేందుకు తెగ కష్టపడుతున్నారు. ముఖ్యంగా పెళ్లికాని ఒకప్పటి స్టార్ హీరోయిన్లు సోషల్ మాద్యమాల్లో తెగ రెచ్చిపోతున్నారు. అలాంటి వారిలో పూనమ్ బజ్వా ఒకరు. మోడల్ గా కెరీర్ ఆరంభించిన పూనమ్ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది.ఈ మద్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది.
తెలుగు ఇండస్ట్రీకి దూరమైన పూనమ్ కోలీవుడ్, మాలీవుడ్ లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తమిళంలో నటరాజ్ హీరోగా నటించిన గురుమూర్తి మూవీలో హీరోయిన్ గా నటించింది. సినిమా ఛాన్సుల కోసం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదిక చేసుకొని గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఆ మద్య ఓ దర్శకుడితో పెళ్లి అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాకి.. కానీ దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు పూనమ్ బజ్వా.
ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గ్లామర్ షోకి.. స్కిన్ షోకి చాలా తేడా ఉంటుందని.. తాను కేవలం గ్లామర్ షో మాత్రమే చేస్తున్నానని.. స్కిన్ చేయడం లేదని.. తన పరిధి దాటి ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదని క్లారిటీ ఇచ్చింది . టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. తాజాగా ఈ అమ్మడు స్కిన్ టైట్ జీన్స్ తో నడుం, నాభి అందాలు చూపిస్తూ నెటిజన్లు ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.