Meena: సీనియర్ హీరోయిన్ మీనా ఇంట విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె తన భర్తను కోల్పోయారు. భర్త విద్యాసాగర్ ని మిస్ అయినందుకు ఆమె ఎంతగానో బాధపడుతున్నారు. తాజాగా మీనా తన భర్త గురించి పోస్ట్ పెట్టారు. పెళ్ళి రోజున ఆయనను తలచుకుంటూ మీనా.. పోస్ట్ చేసిన మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“నువ్వు మాకు దేవుడిచ్చిన అందమైన దీవెనవి. కానీ ఆ దేవుడు నిన్ను చాలా త్వరగా మా నుంచి తీసుకెళ్లాడు. నువ్వు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావు. ప్రపంచం నలుమూలల నుంచి ప్రేమను, ప్రార్థనలను పంపిస్తున్న మిలియన్ హార్ట్స్‌కి.. నా కుటుంబం మరియు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు ఈ ప్రేమ ఖచ్చితంగా అవసరం. మాపై.. స్నేహితులు, ఫ్యామిలీ ఎవరైతే శ్రద్ధ, ప్రేమను చూపిస్తూ.. సపోర్ట్ చేస్తున్నారో.. మీరు మా జీవితంలో ఉన్నందుకు గొప్పగా ఫీలవుతున్నాము. మీ ప్రేమను నేను గ్రేట్ ఫుల్ గా ఫీలవుతున్నాము” అంటూ మీనా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కు నెటిజన్లు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాదం నుండి మీనా త్వరగా బయట పడాలని కోరుకుందాం. ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Ramya Krishna: రమ్యకృష్ణ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా?
ఇది కూడా చదవండి: Upasana Konidela: పిల్లల్ని వద్దనుకున్న రామ్‌చరణ్ దంపతులు అంటూ వార్తలు!