చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య పుట్టే ప్రేమలు, బ్రేకప్ లు ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయాయి. ఏదొక సినిమా సమయంలో కలిసి పనిచేయడం.. కొద్దిరోజులకు ప్రేమలో పడటం.. కొన్నాళ్లు కలిసి తిరగటం.. అంతా అయిపోయాక బ్రేకప్ తో ఫుల్ స్టాప్ పెట్టేయడం మాములే. ఎందుకంటే.. ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సినిమా జంటలు కూడా ఈజీగా ‘మా దారులు వేరని తెలుసుకున్నాం. సో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించండి’ అంటూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టి విడిపోవడం చూస్తూనే ఉన్నాం.
ఇండస్ట్రీలో లవ్, బ్రేకప్స్ వరకు ఓకే కానీ.. పెళ్లి అనేసరికి వీరి బంధం నిలబడుతుందా లేదా అనే సందేహాలు ఎక్కువ. అయితే.. తమిళ స్టార్ హీరో కార్తీక్ కుమారుడు.. గౌతమ్ కార్తీక్ తమిళ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ అయితే ఇచ్చాడు.. కానీ సరైన హిట్ లేక విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ హీరోయిన్ తో సినిమా షూటింగ్ టైంలో ప్రేమలో పడి పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అక్కినేని నాగచైతన్యతో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు డెబ్యూ చేసిన మంజిమ మోహన్. మంజిమకి కూడా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది. మంజిమ తండ్రి సినిమాటోగ్రాఫర్ విపిన్ మోహన్.. ప్రముఖ డ్యాన్సర్ కళా మండలం గిరిజ కావడం విశేషం. అంటే మొత్తానికి ఈ ప్రేమికులిద్దరూ సినిమా ఫ్యామిలీలకు చెందినవారే.
అసలు విషయానికి వస్తే.. గౌతమ్ – మంజిమ కలిసి 2019లో దేవరత్తమ్ అనే సినిమా చేశారు. ఆ సినిమా టైంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని.. అప్పటినుండి ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని కోలీవుడ్ కోడైకూస్తోంది. ప్రస్తుతం ఈ జంట చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి వార్త వినిపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి పెళ్లి పై క్లారిటీ ఇస్తారేమో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.