ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పలు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడుతున్నారు.. కొంత మంది చనిపోయారు. బాలీవుడ్ బ్యూటీ నటి మలైకా అరోరా శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. పూణేలో జరిగిన ఫ్యాషన్ షో ఈవెంట్ కి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మలైకకు గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు.
ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేలో ఆమె ప్రయాణిస్తున్న కారు 38వ కిమీ పాయింట్ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు వాహనాల మధ్య మలైకా కారు నలిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆమెతో పాటు డ్రైవర్, ఓ బాడీ గార్డ్ ఉన్నారని తెలుస్తోంది. మలైకా కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయ్యింది.. ప్రస్తుతం ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను ఆపోలో హాస్పిటల్ కి తరలించారు. ఈ ప్రమాదంలో మలైకాకి కంటి వద్ద గాయం అయ్యిందని.. ప్రస్తుం ఆమెకు చికిత్స అందిస్తున్నామని డాక్టర్లో తెలిపారు. ఆమె కోలుకున్న తర్వాత స్టేట్ మెంట్ తీసుకుంటామని.. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నామనీ పోలీసులు చెప్పారు.