అచ్చతెలుగు చీరకట్టుతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది అలనాటి అందాల తార లయ. చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వచ్చారామే. తన హోం టూర్ తో అభిమానులను పలకరించారు.
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం పెరగడంతో అభిమానులతో ఎప్పుడూ దగ్గరగానే ఉంటున్నారు సెలబ్రిటీస్. ఇక కొంతమంది నటీ, నటులు ఇంకో అడుగు ముందుకు వేసి తమ హోం టూర్లను వీడియోలుగా చేసి అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది నటీ, నటుల హోం టూర్లను మనం చూశాం. అయితే చాలా సంవత్సరాల తర్వాత కెమెరా ముందుకు వచ్చింది అలనాటి అందాల తార హీరోయిన్ లయ. సుమన్ టీవీ చేసిన హోం టూర్ లో తన ప్రస్తుత జీవిత విశేషాలతో పాటుగా, అప్పటి సినిమా ముచ్చట్లు కూడా పంచుకుంది. ఇక లయ ఇల్లు మెుత్తం అవార్డులతో నిండిపోవడం విశేషం.
లయ.. అచ్చతెలుగు చీరకట్టుతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. తనదైన నటనతో వరుసగా మూడు నంది అవార్డులు సొంతం చేసుకుని నటనలో తనకు తానే సాటి అనిపించుకుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు లయ. పెళ్లి తర్వాత యూఎస్ లో సెటిల్ అయ్యారు. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది ఈ అందాల సోయగం. స్వయంవరం సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అలానే, అంతే అందంతో కుర్రాళ్ల మనసు దోచుకుంటోంది.
తాజాగా సుమన్ టీవీ లయ ఇంటి హోం టూర్ ను చేసింది. ఈ హోం టూర్ లో తన జీవితానికి సంబంధించిన చాలా విషయాలతో పాటుగా తనకు వచ్చిన అవార్డుల గురించి కూడా చెప్పుకొచ్చింది. వరుసగా మూడు నంది అవార్డులు సాధించి ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్ చేసింది. తనకు వచ్చిన అవార్డుల గురించి చెప్పుకుంటూ మురిసిపోయింది లయ. ఇక్కడున్న అవార్డులను యూఎస్ తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాని ఆమె అన్నారు. ఇక తమ ఇంట్లో పెంచుకునే పక్షుల గురించి చెప్పుకుంటూ చిరునవ్వులు చిందించారు. అన్ని బాషల్లో కలిపి దాదాపుగా 60 సినిమాల్లో నటించానని అందులో 40 సినిమాలు తెలుగువే అని లయ తెలిపారు.
అయితే ఆ కాలంలో ఎప్పుడూ చీరలు మాత్రమే కట్టుకుని షూటింగ్ చేసే మేము.. అప్పుడప్పుడు ప్యాంట్, షర్ట్స్ వేస్తం అంటే నిర్మాతలు ఒప్పకునే వారు కాదు అని ఈ సందర్భంగా లయ చెప్పుకొచ్చారు. ఇక అరవింద సమేతాలో అవకాశం వచ్చినప్పటికీ చెయ్యలేదు అని అని తెలిపారు. అయితే అవకాశాలు వస్తే తప్పకుండా చేయడానికి సిద్దం అని ఆమె అన్నారు. లయ అందానికి, నవ్వుకు యాంకర్ సరదా ప్రశ్నలు తొడవ్వడంతో ఈ హోం టూర్ సరదా సరదాగా సాగింది. ప్రస్తుతం అలానాటి అందాల తార లయ హోం టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత అంతే అందంతో కెమెరా ముందుకు వచ్చిన నటి లయపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.